
Team India Jersey : టీమిండియా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. అడిడాస్ సంస్థ అధికారిక భారత క్రికెట్ జట్టు జెర్సీలపై భారీగా ధరలు తగ్గించింది. ఏకంగా 80% వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 నుంచి భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్, ఇప్పటి వరకు అభిమానులకు జెర్సీలు, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయించింది. కానీ ఇప్పుడు చాలా తక్కువ ధరకే అధికారిక అడిడాస్ టీమ్ ఇండియా క్రికెట్ గేర్‌ను సొంతం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది.
డిస్కౌంట్‌కు కారణం ఏంటి?
డిస్కౌంట్‌తో అమ్ముతున్న జెర్సీలపై డ్రీమ్11 లోగో ఉండటమే దీనికి ప్రధాన కారణం. గతంలో డ్రీమ్11 టీమ్ ఇండియాకు లీడ్ స్పాన్సర్‌గా ఉండేది. అయితే, భారతదేశంలో రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై కొత్త చట్టాల వల్ల, బీసీసీఐతో దాని ఒప్పందం ముగిసింది. ఇప్పుడు బీసీసీఐ నేషనల్ టీమ్ లీడ్ స్పాన్సర్ హక్కుల కోసం కొత్తగా అప్లికేషన్లను స్వీకరిస్తోంది. దీంతో డ్రీమ్11 లోగో ఉన్న జెర్సీలను అడిడాస్ భారీ డిస్కౌంట్‌లతో అమ్ముతోంది.
ఏ జెర్సీల మీద తగ్గింపు ఉందంటే..
అడిడాస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కింద ఉన్న జెర్సీలపై 80% వరకు తగ్గింపు లభిస్తోంది.
* FW24 ఇండియా క్రికెట్ టీ20 ఇంటర్నేషనల్ జెర్సీ – 80% తగ్గింపు
* FW24 ఇండియా క్రికెట్ టీ20 ఇంటర్నేషనల్ జెర్సీ (మహిళలది) – 80% తగ్గింపు
* FW24 ఇండియా క్రికెట్ టీ20 ఇంటర్నేషనల్ ఫ్యాన్ జెర్సీ – 70% తగ్గింపు
* ఇండియన్ క్రికెట్ ప్రాక్టీస్ జెర్సీ (పిల్లలది) – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ 2025 పిల్లల రిప్లికా ట్రైనింగ్ జెర్సీ – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ టీ20 రిప్లికా జెర్సీ జూనియర్ (పిల్లలది) – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ ట్రై కలర్ జెర్సీ విత్ 3 స్టార్స్ (మహిళలది) – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ ట్రై కలర్ జెర్సీ విత్ 2 స్టార్స్ (మహిళలది) – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ ట్రైనింగ్ జెర్సీ (మహిళలది) – 80% తగ్గింపు
* టెస్ట్ మ్యాచ్ క్రికెట్ జెర్సీ (మహిళలది) – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ టీ20 రిప్లికా జెర్సీ (పిల్లలది) – 80% తగ్గింపు
* ఇండియా క్రికెట్ వన్ డే ఇంటర్నేషనల్ 2025 రిప్లికా జెర్సీ (పిల్లలది) – 80% తగ్గింపు
ఉదాహరణకు, టీమ్ ఇండియా ప్రస్తుతం టీ20 మ్యాచ్‌లలో ఉపయోగిస్తున్న FW24 ఇండియా క్రికెట్ టీ20 ఇంటర్నేషనల్ జెర్సీ అసలు ధర రూ.5,999. కానీ, ఇప్పుడు డిస్కౌంట్‌తో కేవలం రూ.1,199 కే లభిస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..