
Australia vs Bangladesh, 43rd Match 1st Innings Highlights: 2023 వన్డే ప్రపంచకప్‌లో 43వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం ఆస్ట్రేలియాకు 307 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్ హృదయ్ హాఫ్ సెంచరీ చేశాడు. 79 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌లో ఆరో ఫిఫ్టీ కాగా, ప్రపంచకప్‌లో తొలి అర్థసెంచరీ.
వీరితో పాటు నజ్ముల్ హుస్సేన్ శాంటో 45 పరుగులు, లిటన్ దాస్ 36 పరుగులు, తాంజిద్ హసన్ తమీమ్ 36 పరుగులు, మహ్మదుల్లా రియాద్ 32 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తరపున షాన్ అబాట్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తీశారు. మార్కస్ స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది. బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రనౌట్ అయ్యారు.
మూడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం: నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహీద్ హృదయ్ మధ్య మూడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. వీరిద్దరూ 66 బంతుల్లో 63 పరుగులు జోడించారు. శాంటో వికెట్‌తో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 45 పరుగుల వద్ద శాంటో ఔటయ్యాడు.
ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్‌లకు విశ్రాంతి ఇవ్వగా, వారి స్థానంలో స్టీవ్ స్మిత్, సీన్ అబాట్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది.
బంగ్లాదేశ్ జట్టులో మూడు మార్పులు చేసింది. ముష్ఫికర్ రెహమాన్, మెహదీ హసన్, నసుమ్ అహ్మద్‌లకు అవకాశం దక్కింది. కాగా, తంజీమ్ హసన్ షకీబ్, షోరీఫుల్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్‌లను తొలగించారు.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్(కీపర్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..