World Cup 2023: ‘వరల్డ్ కప్’పై రాజకీయ జోక్యం లేదు.. ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ..!

|

Jun 28, 2023 | 7:04 PM

World Cup 2023-Venues Issue: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతాలో సెమీ ఫైనల్స్, అహ్మదాబాద్‌లో టోర్నీ ఫైనల్స్ జరుగుతాయి. అలాగే లీగ్ మ్యాచ్‌లు..

World Cup 2023: ‘వరల్డ్ కప్’పై రాజకీయ జోక్యం లేదు.. ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ..!
ODI WC 2023; Hosting Venues
Follow us on

World Cup 2023-Venues Issue: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతాలో సెమీ ఫైనల్స్, అహ్మదాబాద్‌లో టోర్నీ ఫైనల్స్ జరుగుతాయి. అలాగే లీగ్ మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో.. టోర్నీ వార్మప్ మ్యాచ్‌లు త్రివేంద్రం, గువాహతిలో జరగనున్నాయి. అయితే టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్‌కి కూడా పంజాబ్‌లోని మొహాలి స్టేడియం, మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ స్టేడియంలో జరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్టేడియాల్లో మ్యాచ్‌లు లేకపోవడానికి, అహ్మదాబాద్‌లో మాత్రం 5 మ్యాచ్‌లు ఆడటానికి రాజకీయ జోక్యమే కారణమని బీసీసీఐపై పంజాబ్ స్పోర్ట్స్ మినిస్టర్ గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ ఆరోపణలు చేశారు.

పంజాబ్ మినిస్టర్ చేసిన ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. వాటిని కొట్టివేశారు. ‘విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ సందర్భంగా మొహాలిలో మ్యాచ్ ఆడారు. మొహాలీలోని మరో మైదానం రూపంలో ముల్లన్‌పూర్ స్టేడియం సిద్ధమవుతుంది. అది కానీ ఇప్పటికే సిద్ధంగా ఉంటే.. దానికి వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అతిథ్యం లభించేది. మొహాలి స్టేడియం ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అందుకే ఆ స్టేడియంలో మ్యాచ్‌లు లేవ’ని శుక్లా అన్నారు.

ఇవి కూడా చదవండి


అలాగే ‘ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లు మొహాలిలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. ఇది రొటేషన్ మోడ్‌లో ఉంటుంది. అంతేకానీ టోర్నీ కోసం స్టేడియాలను పిక్ అండ్ సెలెక్ట్ చేయలేదు. మ్యాచ్ వేదికల విషయంలో ICC సమ్మతి ముఖ్యం. త్రివేండ్రంలో మొదటిసారిగా వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నార్త్ ఈస్ట్ జోన్‌లో ఉన్న గువాహతిపై కూడా చాలా చర్చల తర్వాత అవకాశం ఇవ్వడం జరిగింది. ఏదైనా విషయం పూర్తిగా మన చేతుల్లో లేదు. అభ్యంతరాలు తెలిపేవారంతా స్టేడియం ఎంపిక విషయంలో ఐసీసీ అనుమతి అవసరమని గ్రహించాలి’ అని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ శుక్లా పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరిగే ప్రపంచకప్ 2023 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇంకా ఫైనల్ మ్యాచ్‌ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. కాగా ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు 1996 నుంచి మొహాలి, 1987 నుంచి ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..