IPL 2023: ధోని, స్టోక్స్ కానే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ X-ఫ్యాక్టర్ అతనే: టీమిండియా మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..

|

Mar 14, 2023 | 10:09 AM

Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది.

IPL 2023: ధోని, స్టోక్స్ కానే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ X-ఫ్యాక్టర్ అతనే: టీమిండియా మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..
Csk
Follow us on

IPL 2023: ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్‌లో చివరి సీజన్‌ ఆడనున్నట్లు భావిస్తున్నారు. ఈ సీజన్ తర్వాత, అతను అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ధోనీ తనదైన స్టైల్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని, అంటే ఈ సీజన్‌లో అతని బ్యాట్ భీకరంగా దాడి చేయనుందని కూడా చెబుతున్నారు. చివరిసారి కూడా ధోని సీఎస్‌కే తరపున బ్యాటింగ్‌ చేశాడు. ఇక ఐపీఎల్ 2023లో CSK జట్టులో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా చేరాడు. దీంతో చెన్నై టీం మరింత బలంగా బరిలోకి దిగనుంది. అయితే, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం స్టోక్స్, ధోనీ కాకుండా మూడొవ ఆటగాడిని చెన్నై X-కారకంగా పరిగణించాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో హర్భజన్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ ఒక కన్నేసి ఉంచాల్సిన వ్యక్తి రవీంద్ర జడేజా. ముఖ్యంగా సీఎస్‌కే తరపున అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది చూడాలి. అతనిని బ్యాటింగ్‌లో పై స్థానాలకు పంపొచ్చు. ఎలాగూ 4 ఓవర్లు బౌలింగ్‌ కూడా చేస్తాడు. ప్రపంచ క్రికెట్‌ కోణంలో చూస్తే.. అతని కంటే మెరుగైన ఆల్‌రౌండర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో రవీంద్ర జడేజాను చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు హర్భజన్ పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో (చెపాక్ స్టేడియం) బౌలింగ్, బ్యాటింగ్‌లో అతను చాలా సక్సెస్ అయ్యాడు. కాబట్టి జడేజా CSK X-ఫ్యాక్టర్‌గా అనిపిస్తున్నాడని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మార్చి 31 నుంచి ఐపీఎల్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. అదే సమయంలో చెన్నై టీం చివరిసారి IPL 2021 టైటిల్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..