
ఐపీఎల్ 2025 సీజన్‌లో క్రికెట్ కంటే సామాజిక వ్యవస్థపై మరింత దృష్టి వెళ్లేలా చేసే సంఘటన ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చనీయంశమైంది. ముంబై ఇండియన్స్ యువ తెలుగు ఆటగాడు సత్యనారాయణ రాజుతో జరిగిన ఒక సంఘటన కుల విద్వేషాల కలుషితాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. వాంఖడే మైదానంలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సత్యనారాయణను పలకరించిన కొంతమంది తెలుగు అభిమానులు, అతనితో కులం ఆధారంగా చిట్‌చాట్ చేయడం తీవ్ర విమర్శలకు గురైంది. ‘‘రాజు గారూ, మేం మీ కులవాళ్లమే. ఈస్ట్, వెస్ట్ రాజులం. మీ కోసం, తిలక్ వర్మ కోసం రూ. 12 వేల పెట్టి వచ్చాం. స్టేడియం, ఎయిర్‌పోర్ట్ కూడా మనమే కట్టాం’’ అంటూ వారు మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్దంలోనూ కులాన్ని పట్టిపడేసుకున్న మనస్తత్వం ఇంకా మారలేదని, ఇదే ఆంధ్రాలో ఎక్కువగా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
కులాన్ని ఆధారంగా చేసుకుని ఆటగాడిని పొగడటం, ప్రోత్సహించడం ఎంతకైనా మించి మనుషుల మనస్తత్వాన్ని ప్రశ్నించే స్థితికి తీసుకువచ్చింది. ఇది కేవలం సత్యనారాయణ రాజుతో జరిగిన సంఘటన మాత్రమే కాదు, సమాజంలో ఇంకా మిగిలిన కుల జాడ్యాన్ని బయటపెడుతోంది. తాము ఓ ఆటగాడిని అభిమానిస్తున్నామని చెప్పుకోవడమే కాకుండా, అతను తాము చెందిన కులానికి చెందినవాడని ప్రత్యేకంగా చెప్పుకోవడం చాలా మందిలో అసహనం రేకెత్తించింది.
ఇదిలా ఉండగా, ఆంధ్రకు చెందిన సత్యనారాయణ రాజు ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒక వికెట్ మాత్రమే సాధించగలిగాడు. ఫలితంగా జట్టులో తన స్థానం కోల్పోయాడు. ముంబై ఇండియన్స్ అతనిని రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసినా, అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తదుపరి మ్యాచ్‌లకు ఎంపిక కాలేదు.
మరోవైపు, ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో దారుణంగా ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది. బుమ్రా, రోహిత్, హార్దిక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు స్థిరతను అందుకోవడంలో విఫలమవుతోంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.
కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ అభిమానుల ప్రవర్తన కులం చుట్టూ తిరగడం అసాధ్యమైన విషయం. క్రీడలో ప్రతిభ ఆధారంగా గుర్తింపు రావాలి కాని కులం ఆధారంగా కాకూడదు. ఇది కేవలం క్రికెట్‌కు సంబంధించిన సమస్య కాదు, సమాజంలో ఇంకా నాటుకుపోయిన కుల జాడ్యాన్ని సూచించే ఘట్టం. ఆటగాళ్లను వారి ప్రతిభ ఆధారంగా అభిమానించాల్సిన అవసరం ఉంది కాని వారి వంశపారంపర్యం ఆధారంగా కాదు. ఇదే సందేశాన్ని ఈ సంఘటన మనందరికీ అందిస్తోంది.
Em kula gajji gallu ra babu
My respect for KCR increases everytime I see these 🫡 pic.twitter.com/0KmKnk4Dmn— Kowshik 🗿 (@Sanga045) April 9, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..