WTC Final: ఇదేం బోరింగ్ షెడ్యూల్.. 3 నెలల గ్యాపా.. నిద్రపోతున్న ఐసీసీని లేపండయ్యా: విమర్శలు గుప్పించిన మాజీ బౌలర్..

|

Mar 15, 2023 | 7:19 AM

WTC Final 2023: జూన్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ సమయం పట్ల ఆస్ట్రేలియా మాజీ బౌలర్ విమర్శలు కురిపించాడు.

WTC Final: ఇదేం బోరింగ్ షెడ్యూల్.. 3 నెలల గ్యాపా.. నిద్రపోతున్న ఐసీసీని లేపండయ్యా: విమర్శలు గుప్పించిన మాజీ బౌలర్..
Wtc Final 2023 Ind Vs Aus
Follow us on

India vs Australia: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఇటీవలే ముగిసింది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1తో విజయం సాధించింది. ఇప్పుడు ఈ రెండు జట్లు జూన్‌లో జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్‌ మైదానంలో ప్రారంభం కానుంది. అయితే జూన్‌లో ఈ మ్యాచ్ జరగడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ విమర్శలు కురిపించారు. ఐసీసీపై విరుచుకుపడ్డాడు. ఈ టైటిల్ మ్యాచ్‌కు ముందు, IPL-2023 భారతదేశంలో జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో తలపడనుంది.

జూన్ దాకా ఈ మ్యాచ్ కోసం వేచిచూడడం వల్ల అభిమానుల్లో ఆసక్తి తగ్గుతుందని హాగ్ అంటున్నాడు. ఈ మ్యాచ్‌ నిర్వహణకు ఐసీసీ చాలా గ్యాప్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌ ఆడనుంది. అంతకుముందు టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

ఐసీసీ ఏం చేస్తోంది?

హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో జూన్‌లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను నిర్వహించడాన్ని విమర్శించాడు. “ఐసీసీ ఏమి చేస్తోంది? అన్ని ప్రధాన మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మూడు నెలలు ఆగాల్సిందే. ఇది అభిమానులకు మంచిది కాదు. ఐసీసీ త్వరగా మేల్కొనాలి. ఐపీఎల్ తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగేముందు.. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ టీ20లీగ్‌లతో మాంచి ఎంటర్టైన్‌మెంట్ పొందుతారు. ఆ తర్వాత జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ని చూసేందుకు ఆసక్తి చూపకపోవచ్చని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..