సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ పూర్తి కావాలంటే హాఫ్ డే లేదా ఒక రోజు పడుతుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేవలం 40 నిమిషాల్లోనే ఓ ఇన్నింగ్స్ పూర్తయింది. 12 పరుగులకే ఆలౌట్ అయ్యారు. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. ఆ మ్యాచ్ సంగతేంటో ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి, ఈ మ్యాచ్ 1907 జూన్ 10-12 మధ్య జరిగింది. నార్తాంప్టన్షైర్, గ్లౌసెస్టర్షైర్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్షైర్ మొదట బ్యాటింగ్ చేసింది. 60 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో జీఎల్ జెస్సప్ మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్షైర్ చెత్త ప్రదర్శన కనబరిచింది. మొత్తం జట్టు 40 నిమిషాల్లో కేవలం 12 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. చివరి రెండు వికెట్లకు మరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
మొదటి ఇన్నింగ్స్‌లో నార్తాంప్టన్షైర్ జట్టు ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ నాలుగేసి పరుగులు చేయగా.. ఒక ఆటగాడు రెండు, మరో ఆటగాడు ఒక పరుగు చేసి పెవిలియన్ చేరారు. కౌంటీ క్రికెట్‌లో ఇది అత్యల్ప స్కోరు కాగా, మొత్తం మీద మూడవ ఆల్‌టైమ్ అత్యల్ప స్కోరు.
Also Read:
ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..