HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు..

|

Oct 10, 2023 | 4:50 PM

Hyderabad Cricket Association: సుప్రీం కోర్టులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. HCA ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడంపై సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేసిన ఈ మాజీ టీమిండియా క్రికెటర్‌కు నిరాశే ఎదురైంది. తనని HCAలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరిన అజారుద్దీన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఓటర్ జాబితా వచ్చేసిందన్న సుప్రీం కోర్టు.. ఈ తరుణంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు..
Azharuddin
Follow us on

Hyderabad Cricket Association: సుప్రీం కోర్టులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. HCA ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడంపై సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేసిన ఈ మాజీ టీమిండియా క్రికెటర్‌కు నిరాశే ఎదురైంది. తనని HCAలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరిన అజారుద్దీన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఓటర్ జాబితా వచ్చేసిందన్న సుప్రీం కోర్టు.. ఈ తరుణంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

కాగా, సుప్రీం కోర్టు నియమించిన ఏక సభ్య కమిటీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అజారుద్దీన్ వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 31కి వాయిదా వేసింది.

HCA ఎన్నికలు అక్టోబర్ 20న జరగాల్సి ఉంది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఇప్పటికే ఖరారు చేసిన ఓటరు జాబితాపై జోక్యం చేసుకునేందుకు ఇష్టపడలేదు. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్ పేరును పేర్కొన్న డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ సమర్పించిన లేఖ ఆధారంగా కమిటీ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు అధ్యక్షతన ) అజారుద్దీన్ పేరును కొట్టివేసింది. అయితే ఆ పత్రం నకిలీదంటూ అజారుద్దీన్‌ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..