అంపైర్ల పై చర్యలుండవ్ః బీసీసీఐ

| Edited By: Anil kumar poka

Mar 30, 2019 | 6:23 PM

న్యూఢిల్లీ: ఐపీఎల్ లో భారత అంపైర్ల పై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. అయితే దీనిపై చర్యలకు బీసీసీఐ వెనుకంజ వేస్తోందని సమాచారం. ఎందుకంటే ఐపీఎల్‌లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందట. ఇకపోతే మొన్న జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదం జరిగింది.. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సివుండగా… మలింగ నోబాల్‌ వేశాడు. కానీ ఫీల్డు అంపైర్‌ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. ఇక […]

అంపైర్ల పై చర్యలుండవ్ః బీసీసీఐ
Follow us on

న్యూఢిల్లీ: ఐపీఎల్ లో భారత అంపైర్ల పై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. అయితే దీనిపై చర్యలకు బీసీసీఐ వెనుకంజ వేస్తోందని సమాచారం. ఎందుకంటే ఐపీఎల్‌లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందట. ఇకపోతే మొన్న జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదం జరిగింది.. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సివుండగా… మలింగ నోబాల్‌ వేశాడు. కానీ ఫీల్డు అంపైర్‌ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. ఇక అతనితో పాటు నందన్‌ కూడా ఆ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేశారు.

మరోవైపు మ్యాచ్ అనంతరం ఇది తెలుసుకున్న బెంగళూరు సారథి కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ల పొరపాట్లపై ఆక్షేపించాడు. అయితే తాజా ఐపీఎల్‌లో కేవలం 11 మంది భారత అంపైర్లు, ఆరుగురు విదేశీ అంపైర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 56 మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు కానీ… మ్యాచ్‌ రిఫరీ మను నాయర్‌, అంపైర్‌ రవికి నెగెటివ్‌ మార్క్‌ను వేస్తామని బీసీసీఐ తెలిపింది.