IND vs ENG: ఇరగదీస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. తుస్సుమనిపించాడు! కనీసం బౌలింగ్‌లోనైనా..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించినా, నితీష్ కుమార్ రెడ్డి ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ పోరాడుతున్నాడు. మిగతా బ్యాటర్ల నుండి సరైన సహకారం లేదు.

IND vs ENG: ఇరగదీస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. తుస్సుమనిపించాడు! కనీసం బౌలింగ్‌లోనైనా..
Nitish Kumar Reddy

Updated on: Jul 02, 2025 | 9:51 PM

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీతో రాణించినా.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ పోరాటం చేస్తున్నా.. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సపోర్ట్‌ లేకపోవడంతో తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే.. లీడ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఎంపిక చేసిన ప్లేయింగ్‌ ఎలెవన్‌పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కొంతమంది మంచి ప్లేయర్లను అనవసరంగా పక్కనపెట్టారని హెడ్‌ కోచ్‌ గంభీర్‌ను విమర్శించారు క్రికెట్‌ అభిమానులు.

మరీ ముఖ్యంగా ఆల్‌ రౌండర్‌, మన తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్‌ రెడ్డిని తొలి టెస్టులో ఆడించకపోవడంపై క్రికెట్‌ అభిమానులు గంభీర్‌పై మండిపడ్డారు. సరే ఎలాగో తొలి టెస్ట్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది కదా అని.. రెండో టెస్టుకు నితీష్‌ కుమార్‌ రెడ్డిని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకుంటే.. బ్యాటింగ్‌లో దారుణంగా నిరాశపర్చాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి క్రిస్‌ ఓక్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బ్యాటింగ్‌లో కచ్చితంగా ఎంతో కొంత జట్టుకు ఆసరాగా ఉంటాడని భావిస్తే.. కీలక సమయంలో అవుటై టీమ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక ఎండ్‌లో గిల్‌ బాగా ఆడుతుంటే.. అతనికి కనీసం సపోర్ట్‌ ఇవ్వలేకపోయాడు. ఇక బౌలింగ్‌లో అలాగే రెండో ఇన్నింగ్స్‌లోనైనా నితీష్‌ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కానీ, టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. జైస్వాల్‌ 87 పరుగులు చేసి రాణించాడు. ఇక కరున్‌ నాయర్‌ 31, రిషభ్‌ పంత్‌ 25 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొని క్రీజ్‌లో ఉన్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఆడని నితీష్‌ కుమార్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం అందుకున్నాడు. కానీ, తీవ్రంగా నిరాశపర్చాడు. గిల్‌తో పాటు ప్రస్తుతం జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. గిల్‌ లాంగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి, జడేజా మంచి సపోర్ట్‌ ఇస్తేనే ఈ మ్యచ్‌లో భారత్‌ పట్టు సాధించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి