Nitish Kumar Reddy:సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. కళ్లు చెమర్చే వీడియో

|

Dec 28, 2024 | 7:59 PM

మెల్ బోర్న్ టెస్ట్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా అందరినీ హత్తుకుంటూ ఎమోషనల్ అయ్యాడీ యంగ్ క్రికెటర్. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Nitish Kumar Reddy:సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. కళ్లు చెమర్చే వీడియో
Nitish Kumar Reddy
Follow us on

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా 21 ఏళ్ల ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీని మైదానంలో 83,000 మందికి పైగా ప్రేక్షకులు వీక్షించారు. అలాగే కోట్లాది మంది భారతీయులు టీవీలు, మొబైల్స్ లో వీక్షించారు. కామెంటరీ బాక్స్ లో ఉన్న రవి శాస్త్రితో సహా పలువురు క్రికెట్ అభిమానులు ఈ తెలుగబ్బాయి ఆటతీరుని చూసి ఎమోషనల్ అవుతున్నారు. తెలుగు జాతికి గర్వకారణమంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక నితీశ్ రెడ్డి ఆటను చూసేందుకు గ్రౌండ్‌కి వచ్చిన అతని కుటుంబం కూడా కన్నీరుమున్నీరైంది. ముఖ్యంగా నితీష్ తన తొలి సెంచరీని బౌండరీతో పూర్తి చేసిన వెంటనే స్టేడియంలో ఉన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకు గురించి చెబుతూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మూడో రోజు ఆట ముగిసిన తర్వాత నితీష్ కుటుంబ సభ్యులందరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉబికి వస్తోన్న కన్నీళ్లతో తమ కొడుకును కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తద్వారా ఈ మధుర క్షణాలు కలకాలం గుర్తుండిపోయేలా చేసింది.

ఈ వీడియోలో నితీష్ బయటకు వచ్చి ముందుగా తన తల్లిని, ఆ తర్వాత తన సోదరిని హత్తుకున్నాడు. దీని తర్వాత, తన క్రికెట్ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రిని హగ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇద్దరూ ఎమోషనల్‌ అయ్యారు. తన కుమారుడి చారిత్రాత్మక విజయాన్ని చూసి ముత్యాల రెడ్డి మరోసారి కంటతడి పెట్టారు. ఇదే వీడియోలో నితీష్ తండ్రి తన కుమారుడిని ప్రశంసిస్తూ, ‘ఈరోజు నితీష్ చాలా బాగా ఆడాడు. నేను నా బిడ్డను చూసి గర్వపడుతున్నాను’ అని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ సోదరి మాట్లాడుతూ.. ‘నితీష్‌కి ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. తాను చెప్పినట్టే చేశాడు’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులతో నితీశ్ కుమార్ రెడ్డి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..