Zim Afro T10 2023: ఇదేంది సామీ ఈ ఊచకోత.. 14 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సులు.. 314 స్ట్రైక్‌రేట్‌తో బీభత్సం..
Bulawayo Braves vs Durban Qalandars: జింబాబ్వే క్రికెట్ బోర్డు నిర్వహించిన జిమ్ ఆఫ్రో T10 లీగ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Tim Seifert: హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన జిమ్ ఆఫ్రో T10 లీగ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బులవాయో బ్రేవ్స్ కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ తుఫాన్ బ్యాటింగ్‌తో ఆ నిర్ణయం తప్పని రుజువైంది. ఎందుకంటే తొలి ఓవర్ నుంచే సిక్సర్ల వర్షం కురిపించిన సీఫెర్ట్.. బులవాయో బ్రేవ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అంతే కాకుండా 14 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు బాదిన సీఫెర్ట్ 44 పరుగులు చేసి టైమల్ మిల్స్ కు వికెట్ సమర్పించాడు. కాగా, డర్బన్ ఖలందర్స్ జట్టు స్కోరు 3.5 ఓవర్లలోనే 60కి చేరుకుంది.
3వ స్థానంలో వచ్చిన ఆండ్రీ ఫ్లెచర్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. అలాగే, హజ్రతుల్లా జజాయ్ 21 పరుగుల సహకారం అందించాడు. దీంతో పాటు నిర్ణీత 10 ఓవర్లలో డర్బన్ ఖలందర్స్ 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.
123 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బులవాయో బ్రేవ్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేయగలిగింది. ఆష్టన్ టర్నర్ 23 బంతుల్లో 32 పరుగులు చేయగా, సికందర్ రజా (11), రియాన్ బర్ల్ 11 పరుగులు మాత్రమే చేశారు. బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు పడగొట్టి బులవాయో బ్రేవ్స్ జట్టు పరుగుల వేగాన్ని నియంత్రించాడు. దీంతో చివరకు డర్బన్ ఖలందర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బులవాయో బ్రేవ్స్ ప్లేయింగ్ 11: బెన్ మెక్‌డెర్మాట్ (వికెట్ కీపర్), కోబ్ హర్ఫ్ట్, అష్టన్ టర్నర్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, టిమిసెన్ మారుమా, బ్యూ వెబ్‌స్టర్, పాట్రిక్ డూలీ, తనకా చివాంగా, టిమల్ మిల్స్, ఫరాజ్ అక్రమ్.
డర్బన్ ఖలందర్స్ ప్లేయింగ్ 11: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఆండ్రీ ఫ్లెచర్, నిక్ వెల్చ్, ఆసిఫ్ అలీ, జార్జ్ లిండే, బ్రాడ్ ఎవాన్స్, ఓవెన్ ముజోండో, డారిన్ డుపావిలన్, మహ్మద్ అమీర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..