న్యూజిలాండ్ క్రికెటర్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌కు కోవిడ్ నెగిటివ్ వచ్చింది. దీంతో సీఫెర్డ్ భారత్ నుంచి న్యూజిలాండ్‌కు బయలు దేరాడు. ఐపీఎల్ సందర్భంగా కోవిడ్ బారినపడిన న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్ కోలుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు వారి దేశాలకు పయనమయ్యారు. కానీ కరోనా పాజిటివ్‌తో సీఫెర్ట్ ఇక్కడే చికిత్స తీసుకున్నాడు. ఈ కారణంగా ఇక్కడే ఉండిపోయాడు.
అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి: Sonu Sood: సోనూసూద్‌పై కలెక్టర్ విమర్శలు.. అంతలోనే ప్రశంసలు.. అసలు ఏం జరిగిందంటే