Video: 6,4,4,4,6.. ఒకే ఓవర్లో 24 పరుగులు.. పాక్ కెప్టెన్‌ను ఉతికారేసిన యంగ్ ప్లేయర్.. వీడియో చూస్తే పాపం అనాల్సిందే

New Zealand vs Pakistan, 1st T20I: ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్.. పాకిస్థాన్ టీ20 కెప్టెన్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బౌండరీ సిక్సర్ల వర్షం కురిపించాడు. అఫ్రిది వేసిన ఈ ఓవర్‌లో అలెన్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో పాకిస్తాన్ స్టార్ బౌలర్ ఆఫ్రిది ఖాతాలో మరో చెత్త రికార్డ్ నమోదైంది.

Video: 6,4,4,4,6.. ఒకే ఓవర్లో 24 పరుగులు.. పాక్ కెప్టెన్‌ను ఉతికారేసిన యంగ్ ప్లేయర్.. వీడియో చూస్తే పాపం అనాల్సిందే
Nz Vs Pak Shaheen Afridi

Updated on: Jan 12, 2024 | 4:35 PM

Finn Allen Smashed 24 Runs In Shaheen Shah Afridis Over: ఆతిథ్య న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ (New Zealand vs Pakistan) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 46 పరుగుల తేడాతో పాక్ జట్టును చిత్తుగా చేసి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, డెరెల్‌ మిచెల్‌ హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ (Finn Allen) పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బౌండరీ సిక్సర్ల వర్షం కురిపించాడు. అఫ్రిది వేసిన ఈ ఓవర్‌లో అలెన్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు.

అలెన్ 15 బంతుల్లో 35 పరుగులు..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వేలు ఓపెనర్లుగా బరిలోకి వచ్చారు. కానీ, జట్టుకు శుభారంభం లభించలేదు. ఎందుకంటే పాక్ కెప్టెన్ ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కాన్వాయ్ ఔట్ అయి సున్నాకి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ అలెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించాడు. జట్టు తరపున 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అలెన్ 233.33 స్ట్రైక్ రేట్‌తో 35 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి మూడు ఫోర్లు, మూడు అద్భుతమైన సిక్సర్లు చెలరేగాయి.

ఆఫ్రిది 2 ఓవర్లలో 25 పరుగులు..

పాకిస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి డెవాన్ కాన్వే రూపంలో తొలి వికెట్ పడగొట్టాడు. అయితే, అఫ్రిది తొలి ఓవర్ రెండో ఓవర్లో ఏం చేయలేకపోయాడు. అఫ్రిది వేసిన రెండో ఓవర్‌లో అలెన్ తొలి ఐదు బంతుల్లో బౌండరీలు బాదాడు. ఆ ఓవర్ తొలి బంతిని సిక్సర్ బాదిన అలెన్ తర్వాతి మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. ఐదో బంతికి అలెన్ మరో సిక్స్ కొట్టగలిగాడు. చివరి బంతి యార్కర్ కావడంతో, ఆ బంతిలో అలెన్ పరుగులేమీ చేయలేకపోయాడు.

బాబర్ హాఫ్ సెంచరీ..

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ జట్టుకు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అత్యధికంగా 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్ అజామ్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రాణించాడు. అతని టీ20 కెరీర్‌లో ఇది 31వ అర్ధశతకం. కివీస్‌ తరపున టిమ్ సౌథీ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ మిల్నే, బెన్ సీర్స్ తలో 2 వికెట్లు తీశారు.

రెండు జట్లు..

పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది (కెప్టెన్), అబ్బాస్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, ఆడమ్ మిల్నే, మాథ్యూ హెన్రీ, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, బెన్ సియర్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..