NZ Tour of PAK: పాక్ పర్యటనకు కివీస్ జట్టు.. ఐపీఎల్‌ ప్లేయర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన న్యూజిలాండ్.. కెప్టెన్‌గా ఎవరంటే?

|

Apr 03, 2024 | 1:38 PM

New Zealand T20I Squad vs Pakistan: ఐపీఎల్‌లో పాల్గొంటున్న ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విలియమ్సన్‌లు పాక్ టూర్‌కు వెళ్లరు. న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్ టిమ్ సౌథీ అన్ని ఫార్మాట్లలో పాల్గొనడం వల్ల విశ్రాంతి తీసుకోగా, విల్ యంగ్, టామ్ లాథమ్, కొలిన్ మున్రో కూడా అందుబాటులో లేరు. పవర్ హిట్టర్ టిమ్ రాబిన్సన్, ఫాస్ట్ బౌలర్ విలియం ఒరూర్క్ కూడా టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ 4-1తో పాకిస్థాన్‌ను ఓడించింది.

NZ Tour of PAK: పాక్ పర్యటనకు కివీస్ జట్టు.. ఐపీఎల్‌ ప్లేయర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన న్యూజిలాండ్.. కెప్టెన్‌గా ఎవరంటే?
Pak Vs Nz
Follow us on

New Zealand T20I Squad vs Pakistan: పాకిస్థాన్ టూర్‌లో జరిగే టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. 33 ఏళ్ల ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తొలిసారి కెప్టెన్సీ అందుకున్నాడు. IPL 2024లో పాల్గొనే కారణంగా రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లరు. ఏప్రిల్ 18 నుంచి ఇరు దేశాల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 జరగనుంది. తొలి మ్యాచ్ రావల్పిండిలో జరగనుంది.

బ్రేస్‌వెల్‌కి న్యూజిలాండ్ టీ20 జట్టు కమాండ్..

మైకేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా ఏడాది పాటు మైదానానికి దూరంగా ఉన్నాడు. అతని వేలు విరిగిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకపోవడంతో అతను పాకిస్థాన్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. విలియమ్సన్ ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు.

కెప్టెన్సీపై బ్రేస్‌వెల్ మాట్లాడుతూ, ఈ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. న్యూజిలాండ్‌కు మళ్లీ ఎంపికవ్వడంతోపాటు.. కెప్టెన్‌గా సెలక్ట్ కావడం గొప్ప గౌరవం. నేను దీనిని ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బౌల్ట్, విలియమ్సన్ పాకిస్థాన్ టూర్‌కు నో..

ఐపీఎల్‌లో పాల్గొంటున్న ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విలియమ్సన్‌లు పాక్ టూర్‌కు వెళ్లరు. న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్ టిమ్ సౌథీ అన్ని ఫార్మాట్లలో పాల్గొనడం వల్ల విశ్రాంతి తీసుకోగా, విల్ యంగ్, టామ్ లాథమ్, కొలిన్ మున్రో కూడా అందుబాటులో లేరు.

పవర్ హిట్టర్ టిమ్ రాబిన్సన్, ఫాస్ట్ బౌలర్ విలియం ఒరూర్క్ కూడా టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ 4-1తో పాకిస్థాన్‌ను ఓడించింది.

న్యూజిలాండ్ టీ20 జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్‌కాంచీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఒరూర్క్, టిమ్ రాబినిమ్, టిమ్ రాబినిమ్, సీఫెర్ట్, ఇష్ సోధి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..