ICC Test Rankings: రెండు పాయింట్లతో టీమిండియాను దాటేసిన కివీస్.. అగ్రస్థానానికి న్యూజిలాండ్​

|

Jun 13, 2021 | 7:20 PM

ICC Test rankings: అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించిన టెస్ట్​ ర్యాంకింగ్స్​ల్లో న్యూజిలాండ్ జట్టు టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం... కివీస్​ 123 పాయింట్లతో..

ICC Test Rankings: రెండు పాయింట్లతో టీమిండియాను దాటేసిన కివీస్.. అగ్రస్థానానికి న్యూజిలాండ్​
Icc Rankings New Zealand
Follow us on

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించిన టెస్ట్​ ర్యాంకింగ్స్​ల్లో న్యూజిలాండ్ జట్టు టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం… కివీస్​ 123 పాయింట్లతో జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యలో టీమిండియా  121 పాయింట్లతో రెండో స్థానానికి జారిపోయింది. గత కొంత కాలంగా అగ్రస్థానంను కొనసాగిస్తున్న టీమిండియా తాజాగా ప్రకటించిన  ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. కేవలం రెండు పాయింట్లతో మాత్రమే న్యూజిలాండ్ జట్టు ముందుకు దూసుకుపోయింది.

ఇక 108 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండగా.. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 4వ స్థానంలోకి పడిపోయింది. 94 పాయింట్లతో 5వ‌ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి.

ఇక ఇంగ్లాండ్​ గడ్డపై 22 ఏళ్ల తర్వాత సిరీస్​ విజయాన్ని అందుకుంది కివీస్. చివరగా 1999లో టెస్ట్​ సిరీస్​ను గెలుపొందింది న్యూజిలాండ్. ఈ విజయంతో.. ఇక ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్​షిప్ ఫైనల్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

ఇవి కూడా చదవండి: Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్