Asia Cup: అఫ్గాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా? కళ్లన్నీ ఆ అమ్మాయిపైనే.. ఇండియాతో మ్యాచ్‌కూ రావాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్‌

|

Sep 03, 2022 | 3:23 PM

Wazhma Ayoubi: అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అందమైన యువతి తళుక్కుమంది. ఆ మ్యాచ్‌లో కెమెరా కళ్లన్నీ చాలా సేపు ఆ అమ్మాయి వైపే తిరిగాయి. ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్‌ చూసినవారు కూడా ఆమె అందానికి ముగ్ధులయ్యారు.

Asia Cup: అఫ్గాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా? కళ్లన్నీ ఆ అమ్మాయిపైనే.. ఇండియాతో మ్యాచ్‌కూ రావాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్‌
Wazhma Ayoubi
Follow us on

Wazhma Ayoubi: దుబాయి వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీ-2022లో అఫ్గానిస్తాన్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. లీగ్‌ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గాన్ సూపర్‌-4 రౌండ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఆట సంగతి పక్కన పెడితే అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అందమైన యువతి తళుక్కుమంది. ఆ మ్యాచ్‌లో కెమెరా కళ్లన్నీ చాలా సేపు ఆ అమ్మాయి వైపే తిరిగాయి. ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్‌ చూసినవారు కూడా ఆమె అందానికి ముగ్ధులయ్యారు. అంతగా కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఆ యువతి పేరు వాజ్మా అయూబీ.

అఫ్గాన్‌ జట్టుకు అభిమాని అయిన వాజ్మా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో బౌండరీ లైన్‌ వద్ద అఫ్గాన్‌ జాతీయ జెండా పట్టుకుని సందడి చేసింది. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు ఆ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించింది. ఇక మ్యాచ్‌ గెలిచిన తర్వాత తన అభిమాన జట్టుకు సోషల్‌ మీడియాలో ‘కంగ్రాట్స్‌ బ్లూ టైగర్స్‌’అభినందనలు తెలిపింది. అంతే ఆమె ఫోటోలు ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాయి. క్షణాల్లో వైరల్‌గా మారింది. వాజ్మా ఫొటోలను చూసిన కొందరు టీమిండియా అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ‘టీమిండియా వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కు కూడా వస్తారా మేడమ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్‌ 8న మ్యాచ్‌ జరగనుంది. మరి ఆరోజు మ్యాచ్‌కు వాజ్మా వస్తే అందరి కళ్లు ఆమెవైపు ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

బాలీవుడ్ పై ఆసక్తి..

ఇక వాజ్మా విషయానికొస్తే ఆమె ఒక సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌. అలాగే సోషల్‌ యాక్టివిస్టు కూడా. ఎక్కువగా దుబాయిలోనే నివసిస్తోంది. ఫ్యాషన్‌ అంటే మక్కువ ఉన్న ఆమె ‘లామన్ క్లోతింగ్’ అనే ఫ్యాషన్‌ లేబుల్‌ను నిర్వహిస్తోంది. కాగా అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి తాలిబన్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోందీ అందాల తార. ఇలా రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోనూ రాణించాలనుకుంటోందట.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..