NECC Journalist Premier League: ఉత్కంఠ పోరులో ABNపై TV9 అద్భుత విజయం

నెక్ జ‌ర్న‌లిస్ట్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్-2లో భాగంగా డిసెంబర్ 9న ఏబీఎన్ వర్సెస్ టీవీ9 మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది.ఈ పోరులో టీవీ9 ఘన విజయం సాధించి.. సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న TV9 నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 టార్గెట్‌ను ఫిక్స్ చేయగా.. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఏబీఎన్ 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో విజయం టీవీ9ను వరించింది.

NECC Journalist Premier League: ఉత్కంఠ పోరులో ABNపై TV9 అద్భుత విజయం
Neck Journalist Premier League

Edited By: Jyothi Gadda

Updated on: Dec 10, 2025 | 8:15 AM

నెక్ జ‌ర్న‌లిస్ట్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్-2లో భాగంగా డిసెంబర్ 9న ABN Vs TV9 మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ పోరులో టీవీ9 ఘన విజయం సాధించి..సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న TV9.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ సాయికిషోర్ బ్యాటింగ్‌లో రాణించి 41 బంతుల్లోనే 89 పరుగులు చేసాడు. అందులో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ వాసు 20 పరుగులు, ప్రసాద్ 15, సత్య 16 పరుగులు చేయగా.. చివర్లో వచ్చి 15 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ జగదీష్ ఏబీఎన్‌ ముందు 179 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచారు.

ఇక భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ABN పవర్ ప్లే లో బాగానే రానించారు. ఒకపెనర్లుగా వచ్చిన చినబాబు 21 బంతుల్లోనే 33 పరుగులు, సురేష్ 20 పరుగులు చేయగా.. ఆ తర్వాత వచ్చిన ఆదిత్య 17 పరుగులు చేసాడు. తర్వాత వచ్చిన వారు వరుసగా వెనుదిరిగారు.దీంతో 17.5 ఓవర్లలోనే ఏబీఎన్ 121 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 58 పరుగుల భారీ తేడాతో టీవీ9 ఘన విజయం సాధించి సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టింది.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన TV9 కెప్టెన్ సాయి.. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 4 వికెట్లు తీసుకున్నాడు. అటు ఫీల్డింగ్‌లోనూ తనదైన శైలిలో క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇక వాసు, జగదీశ్, సత్య, రాము, రాజు శంభు తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు. TV9 కీపర్ జకీర్ ఫీల్డ్‌లో అదరగొట్టాడు. వికెట్ల వెనకాల 2 క్యాచులు, ఒక స్టంపింగ్, ఒక రనౌట్‌తో సత్తా చాటాడు. TV9 తన తదుపరి పోరు డిసెంబర్ 10 మధ్యాహ్నం 1 గంటకు రెండో సెమీస్‌లో TV5తో తలపడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.