
Mumbai Indians vs Sunrisers Hyderabad: ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ముంబై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అభేద్యమైన నాలుగో వికెట్ కే ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును విజయ తీరానికి చేర్చారు. సూర్యకుమార్ సెంచరీ (51 బంతుల్లో 102, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా, తిలక్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో, కమిన్స్ తలో వికెట్ తీశారు. కాగా హైదరాబాద్ ఓటమితో ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
📸 That picture perfect moment for Mumbai Indians
Suryakumar Yadav leads them to victory with a classic century from him 👌💙
Scorecard ▶️ https://t.co/iZHeIP3ZRx#TATAIPL | #MIvSRH pic.twitter.com/efD1w0JakB
— IndianPremierLeague (@IPL) May 6, 2024
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార
నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్
యాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్,
🎥 Range of shots from Suryakumar Yadav 💥
💯 partnership up for the 4th wicket now as Mumbai Indians continue to march on 👌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/WBxZpPGEQq
— IndianPremierLeague (@IPL) May 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..