MI vs PBKS Highlights in Telugu: IPL 2021లో డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా నేడు రెండవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) తలపడ్డాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సీజన్ 42 వ మ్యాచ్‌గా జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో ముంబయి టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయంలో సౌరభ తివారి(45), హార్ధిక్ పాండ్యా(40) కీలకంగా వ్యవహరించారు.
IPL 2021 లో డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా నేడు రెండవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సీజన్ 42 వ మ్యాచ్‌గా జరగుతుంది. కీలకమైన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో ముంబయి టీంపై 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
నేడు IPL 2021 లో డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. రెండవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) తలపడనుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సీజన్ 42 వ మ్యాచ్‌గా జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పంజాబ్ కంటే 8 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది. జట్టు తన ఆశలను సజీవంగా ఉంచడానికి ఈ విజయం చాలా అవసరం. మరోవైపు, ఐదవ స్థానంలో ఉన్న పంజాబ్ టాప్ 4 కోసం పోరాటం చేయనుంది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (కెప్టెన్, కీపర్), మన్ దీప్ సింగ్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో ముంబయి టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయంలో సౌరభ తివారి(45), హార్ధిక్ పాండ్యా(40) కీలకంగా వ్యవహరించారు.
తివారి (45) రూపంలో ముంబయి టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
12 ఓవర్లు ముగిసే సరికి ముంబయి టీం 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో తివారి 33, హార్దిక్ పాండ్యా 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
డికాక్ (27) రూపంలో ముంబయి టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. డికాక్, తివారి కలిసి కీలక భాగస్వామ్యం అందిస్తున్న సమయంలో ముంబయి టీం వికెట్ కోల్పోవడంతో మరింత కష్టాల్లో కూరుకపోయింది. ప్రస్తుతం 10.1 ఓవర్లకు టీం మూడు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
ముంబయి టీం 9 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ 22, తివారి 23 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ముంబయి టీంకు కీలక భాగస్వామ్యాన్ని(38 పరుగులు 32 బంతులు) అందించే పనిలో పడ్డారు.
7 ఓవర్లు ముగిసే సరికి ముంబయి టీం రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ 17, తివారి 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పంజాబ్ యగ్ బౌలర్ బిష్ణోయ్ దెబ్బకు ముంబై టీం వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్(8), సూర్యకుమార్ (0) రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయి కష్టాల్లో పడింది.
రోహిత్ (8) రూపంలో ముంబయి టీం తొలి వికెట్‌ను కోల్పోయింది.
3 ఓవర్లు ముగిసే సరికి ముంబయి టీం 15 పరగులు చేసింది. క్రీజులో రోహిత్ 8, డికాక్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
కీలకమైన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో ముంబయి టీంపై 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
దీపక్ హుడా (28) ఔట్ రూపంలో పంజాబ్ టీం 6వ వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో టీం స్కోర్ 123 వద్డ పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మక్రాం (42) రూపంలో పంజాబ్ టీం 5వ వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 109 వద్డ బౌల్డయ్యాడు.
14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ టీం 4 వికెట్లు కోల్పోయి 90 పరగులు చేసింది. క్రీజులో మక్రాం 29, దీపక్ హుడా 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పంజాబ్ 8 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్కరమ్ 7 పరుగులు, దీపక్ హుడా 1 పరుగుతో ఆడుతున్నారు. కీరన్ పొలార్డ్ మాత్రం రెండు వికెట్లు తీశాడు.
పంజాబ్ 48 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో నికోలస్ పూరన్ ఎల్బీడబ్లు అయ్యాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులోకి దీపక్ హుడా అడుగుపెట్టాడు.
పోలార్డ్ మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు సాధించాడు. ఇద్దరు డేంజర్ బ్యాట్స్‌మెన్స్ క్రిస్‌గేల్, కె. ఎల్ రాహుల్‌ని ఔట్ చేశాడు. అంతేకాదు 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
పంజాబ్ 41 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రాహుల్ 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. పోలార్డ్ బౌలింగ్‌లో బుమ్రా అద్భుత క్యాచ్ పట్టాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు.
పంజాబ్ 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. పోలార్డ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య అద్భుత క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి ఎయిడెన్ మార్కరమ్ వచ్చాడు.
పంజాబ్ 5 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. మన్‌దీప్ 15 పరుగులకు ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 19 పరుగులతో ఆట కొనసాగిస్తుండగా, క్రీజులోకి క్రిస్ గేల్ అడుగుపెట్టాడు.
3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ టీం వికెట్ నష్టపోకుండా 21 పరగులు చేసింది. క్రీజులో మన్‌దీప్ 10, రాహుల్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా మన్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (కెప్టెన్, కీపర్), మన్ దీప్ సింగ్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
ఇప్పటి వరకు ఇరు జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 14 సార్లు గెలిచింది. 13 మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
A cracking contest on the cards in Abu Dhabi! ? ?
The @ImRo45-led @mipaltan square off against @klrahul11‘s @PunjabKingsIPL in Match 42 of the #VIVOIPL. ? ? #MIvPBKS
Which side will come up trumps❓ pic.twitter.com/Fr6X3EErJJ
— IndianPremierLeague (@IPL) September 28, 2021