
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అగ్రశ్రేణి ఆటగాళ్లను గుర్తించి, వారి ప్రతిభను మెరుగుపరిచే విధానాన్ని అనుసరించడం వల్ల, జట్టు విజయశిఖరాలను అధిరోహించింది. ఈ విజయంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల పాత్ర కీలకం.
2015లో, ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తన స్కౌటింగ్ బృందంతో భారతదేశంలోని వివిధ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను పరిశీలించసాగారు. ఓ రోజు, ఇద్దరు సన్నగా, పొడవుగా ఉన్న యువ ఆటగాళ్లను స్కౌట్స్ శిబిరానికి తీసుకువచ్చారు. వారు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.
“నేను వారితో మాట్లాడినప్పుడు, వారు మూడేళ్లుగా మ్యాగీ నూడుల్స్ తప్ప మరేమీ తినలేదని చెప్పారు. వారి వద్ద డబ్బు లేకపోయినా, వారిలో విజయవంతం కావాలనే ఆకలి కనిపించింది,” అని నీతా అంబానీ గుర్తుచేసుకున్నారు.
2015లో ముంబై జట్టు హార్దిక్‌ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేయగా, 2016లో కృనాల్‌ను రూ. 2 కోట్లకు సంతకం చేసుకుంది. హార్దిక్ ఆ సీజన్‌లోనే తన ప్రతిభను నిరూపించి, జట్టును ఐపీఎల్ టైటిల్ గెలిపించడంలో సహాయపడ్డాడు. 2016లో భారతదేశం తరపున అరంగేట్రం చేసిన హార్దిక్, 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా మారి జట్టుకు టైటిల్‌ను . 2024లో ముంబైకి తిరిగి వచ్చి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
2013లో ముంబై ఇండియన్స్, తక్కువ గుర్తింపు ఉన్న జస్ప్రీత్ బుమ్రాను వేలం వెలుపల తీసుకుంది. అప్పట్లో అతని బౌలింగ్ స్టైల్ విభిన్నంగా కనిపించినప్పటికీ, జట్టు యాజమాన్యం అతనిలో అద్భుత ప్రతిభను గుర్తించింది. 2014లో రూ. 1.2 కోట్లకు ముంబై అతన్ని తిరిగి తన జట్టులోకి తీసుకుంది.
“మా స్కౌట్స్ అతని బౌలింగ్‌ను చూసి, ఈ యువ ఆటగాడు బంతితో మాట్లాడగలడని చెప్పారు. మేము అతన్ని జట్టులోకి తీసుకున్నాం, మిగతా కథ చరిత్ర,” అని నీతా అంబానీ తెలిపారు. బుమ్రా ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగుతూ, భారతదేశపు అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడు. అతను మరే ఇతర ఐపీఎల్ జట్టుకు ఆడలేదు.
2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ యువ ఆటగాడు తన అద్భుత బ్యాటింగ్‌తో 2023లో భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
“తిలక్ వర్మను మేము 2022లో జట్టులోకి తీసుకున్నాం, ఇప్పుడు అతను టీమ్ ఇండియాలో గర్వించదగిన సభ్యుడు. ముంబై ఇండియన్స్‌ను భారత క్రికెట్ నర్సరీ అని పిలవడం సముచితమే,” అని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. తిలక్ తన ప్రతిభను నిరూపించుకొని, 2025 మెగా వేలానికి ముందు ముంబై అతన్ని రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను కనుగొని వారిని తీర్చిదిద్దే సామర్థ్యం ఉంది. ముంబై కేవలం ఐపీఎల్ విజేతగా మాత్రమే కాకుండా, భవిష్యత్ భారత జాతీయ జట్టుకు ఆటగాళ్లను అందించే ఒక క్రికెట్ నర్సరీగా మారింది.
హార్దిక్, బుమ్రా, తిలక్ లాంటి ఆటగాళ్లు తమ విజయాలతో ముంబై ఇండియన్స్‌ను మరింత గౌరవనీయమైన జట్టుగా మార్చారు. రాబోయే ఐపీఎల్ సీజన్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుందా? వేచి చూద్దాం!
#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the team
She says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T
— ANI (@ANI) February 17, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..