Sunrisers Hyderabad vs Mumbai Indians: ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి అద్భుత ఆటతీరును కనబరిచింది. మరీ ముఖ్యంగా భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే ముంబయికి బెన్‌ఫిట్ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముంబయి ఆ దిశలో సాగింది. నిర్ణీత 20 ఓవర్‌లలో ఏకంగా 235 పరుగులు సాధించింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబయి భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. కనీసం 120 పరుగుల తేడాతో గెలిస్తేనే ముంబయి నాలుగో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. మరి బ్యాటింగ్‌లో అద్భుతం సృస్టించిన ముంబయి, బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ను కట్టడి చేస్తుందో చూడాలి.
ముంబయి బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ మంచి ఆరంభం ఇవ్వడంతో ముంబయి మొదటి నుంచే దూసుకుపోయింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆటతీరుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గ్రౌండ్ నలుమూలల భారీ షాట్‌లు కొడుతూ బంతిని బౌండరీని దాటించాడు. ఈ క్రమంలోనే ఇషాన్ కేవలం 32 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. వీటిలో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఇక ముంబయికి మంచి ఆరంభాన్ని ఇచ్చిన రోహిత్ శర్మ 18పరుగుల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
అనంతరం హార్ధిక్ పాండ్యా 10 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో రాయ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అనంతరం అభిషేక్ శర్మ రూపంలో ముంబయికి కాస్త ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. జేమ్స్ నిషమ్, పోలార్డ్ రూపంలో రెండు పెద్ద వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో ముంబయి కాస్త తడబడినట్లు కనిపించింది. కానీ అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ చెలరేగి ఆడాడు. ఇషాన్ కిషన్ ఏ స్థాయిలో అయితే రెచ్చి పోయాడే అదే స్థాయిలో సూర్య కుమార్ కూడా రాణించాడు. భారీ ఫోర్లు, సిక్స్‌లతో జట్టు స్కోరును పెంచాడు.
బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే కేవలం 40 బంతుల్లోనే 82 పరగులు సాధించాడు. ఇక సన్‌రైజర్స్ బౌలింగ్ విషయానికొస్తే రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఉమ్రాన్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్స్‌లో సిద్ధార్థ్ కౌల్ అత్యధికంగా 56 పరుగులు ఇచ్చాడు. ఇక జోసన్ హోల్డర్ నాలుగు వికెట్ల తీసుకున్నాడు.
Also Read: RCB vs DC, IPL 2021: కోహ్లీసేన టార్గెట్ 165.. ఆకట్టుకున్న ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్
Tirumala: శ్రీవారిసేవలో భాగంగా మెరుగైన సేవలను ఉచితంగా అందిస్తామన్న జియో.. త్వరలో ప్రత్యేక యాప్..
Girl Kidnap: బ్రేకింగ్: నిజామాబాద్ షాపింగ్ మాల్‌లో చిన్నారి అపహరణ.. సీసీ టీవీ విజువల్స్