Nehal Wadhera: భారతదేశంలోని యువ ఆటగాళ్లు తమ సత్తా చూపేందుకు ఐపీఎల్ ఓ వేదికగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చాలామంది యువకులు ఆకట్టుకున్నారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి పదహారవ సీజన్ వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఎంతోమంది తెలియని ఆటగాళ్లను రాత్రికి రాత్రే స్టార్‌లుగా మార్చిన ఐపీఎల్.. ప్రస్తుం సందడి చేసేందుకు మరోసారి సిద్ధమైంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఇలాంటిదే కనిపించింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబై ఆరంభం చాలా దారుణంగా ఉంది. దీంతో ముంబై 8.5 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు ఔట్ అయిన తర్వాత 22 ఏళ్ల నెహాల్ వధేరా బ్యాటింగ్‌కు దిగాడు.
నేహాల్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడం అభిమానులకు తెలియదు. కానీ, తక్కువ సమయంలోనే నెహాల్ తన భీకర బ్యాటింగ్ బలంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ఎండ్‌లో తిలక్ వర్మతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన నెహాల్.. కేవలం 13 బంతుల్లో రెండు సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి వచ్చిన ఓ భారీ సిక్స్ కూడా వచ్చింది. దీంతో ఐపీఎల్ 2023లో 100 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కర్ణ్ శర్మ వేసిన 14వ ఓవర్ మూడో బంతిని మిడ్ వికెట్ దిశగా సిక్సర్‌గా మలిచాడు. బంతి 101 మీటర్ల దూరంలో పడింది.
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ నెహాల్ వధేరా.. 101 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టిన తర్వాత, అదే బౌలర్ చేతికి చిక్కాడు. విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, తన చిన్న ఇన్నింగ్స్‌లో అంటే కేవలం 13 బంతుల్లో 21 పరుగులతో భీకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒత్తిడిలో నిర్భయంగా బ్యాటింగ్ చేస్తూ దిగ్గజాలకు షాక్ ఇచ్చాడు.
The massive 101M six by the debutant, Nehal Wadhera.
The first Indian to smash a 100M six in IPL 2023. pic.twitter.com/jAGHyQDu00
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023
పంజాబ్‌లోని లూథియానాలో సెప్టెంబర్ 4, 2000న జన్మించిన నెహర్ వధేరా భారత అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరపున రంజీల్లో అరంగేట్రం చేశాడు. పంజాబ్ తరపున 5 మ్యాచ్‌లు ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలతో సహా 53.71 సగటుతో 376 పరుగులు చేశాడు.
గుజరాత్‌పై తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా అతను తన రంజీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత మొహాలీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 214 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌తో పాటు, నేహాల్ వధేరా లెగ్ స్పిన్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఐపీఎల్‌లో అతడికి ప్రాధాన్యం ఇచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..