
MS Dhoni Visits Deori Temple: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా ఏళ్లు అవుతున్నా అభిమానుల్లో ధోని క్రేజ్ మాత్రం మునుపటిలానే ఉంది. అందుకే ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతున్నారు. ఈ లెజెండరీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ధోని ఇప్పుడు ఐపీఎల్ 2025 లో మరోసారి యాక్షన్‌లో కనిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం అతను ఇంకా సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించాడు. ఇదిలా ఉంటే, ధోనీ రాంచీలోని 700 ఏళ్లకు పైగా పురాతనమైన దియూరి ఆలయాన్ని సందర్శించేందుకు చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
భారీ పోలీసు బందోబస్తు మధ్య ధోనీని దర్శనం కోసం ఆలయానికి తీసుకెళ్లినట్లు వీడియోలో చూడొచ్చు. అతని చేతిలో ఎరుపు రంగు వస్త్రాని కూడా చూడొచ్చు. ధోని నుదుటిపై తిలకం పెట్టారు. గుడిలో కూడా ధోనీ వీడియో తీసే అవకాశాన్ని జనం ఏమాత్రం వదులుకోలేదు.
దియూరి ఆలయాన్ని సందర్శించి, ఆ దేవత ఆశీస్సులు తీసుకునేందుకు ధోని ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా, అతను ఈ పురాతన ఆలయాన్ని చాలా సందర్భాలలో సందర్శించాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ అతనిని రూ.4 కోట్లకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకుంది. ఎల్లో జెర్సీలో ఆడుతున్న ధోనీని చూసే అవకాశం మరోసారి తమకు లభించడంపై సీఎస్‌కే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ధోని పెద్దగా పరుగులు చేయకపోయినా, తన తుఫాన్ బ్యాటింగ్‌తో అభిమానులను ఎంతగానో అలరించాడు. అయితే, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ధోని ఎలా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..