MS Dhoni: భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో మాత్రం సీఎస్‌కే సారథిగా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అలాగే పలు యాడ్స్‌లోనూ కనిపిస్తూ ఫ్యాన్స్ చెంతకు చేరుతూనే ఉన్నాడు. తాజాగా ఓ యాడ్‌లో నటించిన మహేంద్రసింగ్ ధోనిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఇదేం యాడ్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.’అన్‌అకాడమీ’ యాడ్‌లో మెరిసిన ఎంఎస్.. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ ఎడ్యూకేషనల్ సంస్థ అన్‌అకాడమీ ‘లెస్సన్ 7’ పేరుతో ఈ యాడ్‌ను రూపొందించింది. సోమవారం సోషల్ మీడియాలో ఈ యాడ్‌ను విడుదల చేసింది.
ఇందులో ధోనీ వెనుక నుంచి ట్రైన్ వస్తున్నట్లు మనం చూడొచ్చు. అయితే భారత మాజీ సారథి పట్టాలపై పరిగెత్తుతూ ఎదురుగా వస్తున్న అడ్డుగోడలను చీల్చుకుంటూ రైలు కంటే ముందుగా వెళ్తుంటాడు. అంటే మనం ముందుకు వెళ్లడంలో వచ్చే ఎన్నో అడ్డకులను దాటుకుని మన గమ్యాన్ని చేరుకోవాలంటూ ఈ యాడ్‌లో చూపించారు. ‘గమ్యం వైపు చూపు.. ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను దాటాలనే సంకల్పం.. విజేతగా చేస్తుంది! ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ డే సందర్భంగా.. విపత్కర సమయాల్లో ‘లెస్సన్ 7’ను గుర్తుంచుకోండి’ అనే క్యాఫ్షన్‌తో ఈ యాడ్‌ను సోషల్ మీడియాలోకి వదిలారు. ఈ సందర్భంగా ఇదో ఐకానిక్ యాడ్ అని అన్‌అకాడమీ సంస్థ సీఈవో గౌరవ్ ముంజల్ పేర్కొన్నాడు.
అయితే, కొంతమంది మాత్రం ఈ యాడ్ చాలా చెత్తగా ఉందని, ధోని ఎందుకు నటించాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉందని, మంచి మోటివేషనల్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Our most ambitious and Iconic Film till date. Took almost 1 year to make.
Lesson No. 7 https://t.co/b2TNY46UGD
— Gaurav Munjal (@gauravmunjal) January 24, 2022
One of the most non sense add ..
— Santhosh (@mail2sant) January 24, 2022
All this is just a business gimmick… money is top priority and students last for unacademy.. #shameonyou
— ?? दीपक प्रकाश ?? (@imdeepakprakash) January 24, 2022
I do not understand how dhoni is related to education? why not use the top educators
— Sanskar ? 2022 goal – 12 Products 12 Month (@indianappguy) January 24, 2022
Also Read: Gautam Gambhir: కరోనా బారిన గౌతమ్ గంభీర్.. సోషల్ మీడియాలో ప్రకటన..!
IPL 2022: సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చిన దక్షిణాఫ్రికా.. అప్పటి వరకు ఆగాలన్న బీసీసీఐ