Ranji Trophy 2024: ఈ ధోని శిష్యుడి ఇంత డేంజర్ ఏంటి భయ్యా.. ఈ తుషార్ హుషార్ చూస్తే ప్రత్యర్థులకు దడే పుట్టాల్సిందే..

Ranji Trophy 2024 Semi Final: గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ IPL ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తుషార్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారు. ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ 2023లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు తుషార్ 23 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. ఈ 28 ఏళ్ల బౌలర్ ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 34 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 92 వికెట్లు పడగొట్టాడు.

Ranji Trophy 2024: ఈ ధోని శిష్యుడి ఇంత డేంజర్ ఏంటి భయ్యా.. ఈ తుషార్ హుషార్ చూస్తే ప్రత్యర్థులకు దడే పుట్టాల్సిందే..
Tushar Deshpande

Updated on: Mar 03, 2024 | 1:59 PM

IPL 2024కి ముందు, మహేంద్ర సింగ్ ధోని టీంమేట్, పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే రంజీ ట్రోఫీ 2024 సెమీ-ఫైనల్‌లో అద్భుతంగా ఆడాడు. ముంబై తరపున ఆడుతున్న తుషార్ సెమీ ఫైనల్లో తమిళనాడుపై తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. తుషార్ విధ్వంసక బౌలింగ్ కారణంగా తమిళనాడు జట్టు శనివారం తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవర్లు మాత్రమే ఆడి తొలి రోజు 146 పరుగులకే కుప్పకూలింది.

తుషార్ దేశ్‌పాండే తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రదోష్ రంజన్ పాల్, కెప్టెన్ సాయి కిషోర్, బాబా ఇంద్రజిత్‌లకు తుషార్ పెవిలియన్ దారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు కెప్టెన్ సాయి కిషోర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ, గ్రీన్ టాప్ వికెట్‌పై అతని నిర్ణయం సరైనదని నిరూపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న పేసర్ తుషార్ దేశ్‌పాండే తమిళనాడుపై విధ్వంసం సృష్టించాడు. స్కోర్‌బోర్డ్‌లో 20 పరుగులు కూడా చేరలేదు, తమిళనాడుకు చెందిన 4 బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు చేరారు.

తమిళనాడుపై తుషార్ 3 వికెట్లు తీయగా..

తమిళనాడు 42 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత టీమ్ ఇండియా నుంచి విడుదలైన విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్ మధ్య మంచి భాగస్వామ్యం కుదిరింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 191 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తమిళనాడు స్కోరు 90 పరుగుల వద్ద ఉన్న సమయంలో విజయ్ శంకర్‌ను ఔట్ చేయడం ద్వారా శార్దూల్ ఠాకూర్ ఈ ప్రమాదకరమైన జోడీని బ్రేక్ చేశాడు. దీని తర్వాత సుందర్ కూడా 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఔట్ కావడంతో జట్టు మొత్తం 146 పరుగులకే ఆలౌట్ అయింది. శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు.

IPL 2023లో తుషార్ 21 వికెట్లు..

గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ IPL ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తుషార్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారు. ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ 2023లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు తుషార్ 23 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. ఈ 28 ఏళ్ల బౌలర్ ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 34 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 92 వికెట్లు పడగొట్టాడు.

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో తుషార్ దేశ్‌పాండే సెంచరీ..

గత మ్యాచ్‌లో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 11వ నంబర్‌లో బ్యాటింగ్ చేసి 123 పరుగుల ఇన్నింగ్స్‌లో రికార్డు సృష్టించాడు. అతనితో పాటు తనుష్ కోటియన్ కూడా 10వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 78 ఏళ్ల తర్వాత ఇది జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..