
ఎంఎస్ ధోనీకి మైదానంలో తిరుగు లేదు. మ్యాచ్ గెలిచే నైపుణ్యం అతనికంటే మరెవరికీ అంతగా తెలియదనడంలో సందేహం లేదు. అలాగే ఫీల్డ్ వెలుపల కూడా ఈ కళలో సమానంగా నిలిచాడు. మైదానం వెలుపల నిజ జీవితంలోని హీరోలకు గౌరవం, ప్రేమను అందించడంలో ధోనీ ముందుంటున్నాడు. తాజాగా ఇలాంటి అరుదైన సీన్ కనిపించింది. ఏనుగులను కాపాడే బోమన్, బెయిలీలను గౌరవించిన ధోనీ.. ఆయన 7వ నంబర్ జెర్సీని ఆస్కార్-విజేత దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్‌కు బహుమతిగా అదించాడు.
మంగళవారం చెపాక్ స్టేడియంలో శిక్షణ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోని ఈ ముగ్గురికి తన జెర్సీని అందించాడు. ఇది మాత్రమే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఈ వ్యక్తుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇందులో ఆస్కార్ విన్నింగ్ ఎలిఫెంట్ విస్పర్స్ డైరెక్టర్, ఏనుగు సంరక్షకులు పాల్గొన్నారు.
Tudumm ? Special occasion with very special people ??#WhistlePodu #Yellove ? pic.twitter.com/AippVaY6IO
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
ఎంఎస్ ధోని తన జెర్సీని బహుమతిగా అందించి సత్కరించాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మొమెంటోలు కూడా అందించారు. దీంతో పాటు ఏనుగుల సంరక్షణ కోసం ముదుమలై టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌కు కూడా సీఎస్‌కే చెక్ ఇచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ధోని చేతికి ఆస్కార్ అందించారు.
ఆస్కార్-విజేత డాక్యుమెంటరీ ఎలిఫెంట్ విస్పర్స్‌లో, బొమన్, బెయిలీ రఘు అనే అనాథ ఏనుగును చూసుకుంటుంటారు. ఇద్దరూ ఏనుగు గాయానికి చికిత్స చేస్తారు. ఆ తర్వాత ఏనుగును కంటికి రెప్పలా పెంచుతారు. అయితే, ఈ టాస్క్‌లో బౌమన్, బెయిలీ ఎలా విజయం సాధించారనేది డాక్యుమెంటరీలో అందంగా చిత్రీకరించారు.
Roars of appreciation to the team that won our hearts! ?
So good to host Bomman, Bellie and filmmaker Kartiki Gonsalves! ?#WhistlePodu #Yellove ??
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీని ఫిల్మ్ మేకర్ కార్తికి గోన్సాల్వేస్ రూపొందించారు. బౌమన్, బెయిలీలతో పాటు, భారతీయ సంస్కృతి కూడా ఇందులో చిత్రీకరించారు. ఈ సందర్భంగా CSK CEO కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. అమ్ము, రఘు అనే రెండు ఏనుగుల ఖర్చులకు సహాయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, ఈ జట్టు IPL 2023లో 11 మ్యాచ్‌లు ఆడిన తర్వాత 13 పాయింట్లను కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..