AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS ధోనికి అరుదైన గౌరవం! ICC హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. మరో ఆరుగురు కూడా..

ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మహేంద్ర సింగ్ ధోనికి స్థానం లభించింది. ఇది ధోని అద్భుతమైన క్రికెట్ జీవితానికి గుర్తు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా అతని అసాధారణ ప్రతిభ, భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకత్వం ఈ గౌరవం కి కారణం.

MS ధోనికి అరుదైన గౌరవం! ICC హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. మరో ఆరుగురు కూడా..
Ms Dhoni
SN Pasha
|

Updated on: Jun 09, 2025 | 11:06 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ధోనితో పాటు మరో ఆరుగురు కూడా ఈ ఏడాది ఈ గౌరవం పొందారు. వారిలో మ్యాథ్యూ హేడెన్‌ (ఆస్ట్రేలియా), హషీమ్‌ ఆమ్లా (సౌతాఫ్రికా), గ్రేమ్‌ స్మిత్‌ (సౌతాఫ్రికా), డానియల్‌ వెట్టోరి (న్యూజిలాండ్‌), సనా మీర్‌ (పాకిస్థాన్‌), సారా టేలర్‌ (ఇంగ్లండ్‌)లకు కూడా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2025లో చోటు దక్కింది. గతంలో ఇండియా నుంచి కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, బిషన్‌ బేడి, వీరేందర్‌ సెహ్వాగ్‌, రాహుల్ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, డయానా ఎడుల్జీ, వినో మన్కండ్‌, సునీల్‌ గవాస్కర్‌లు ఈ అరుదైన గౌరవం పొందారు.

ఇక ధోని విషయానికి వస్తే.. టీమిండియా తరపున 17,266 అంతర్జాతీయ పరుగులు, 829 అవుట్‌లు, అన్ని ఫార్మాట్లలో 538 మ్యాచ్‌లతో ధోని గొప్ప ప్లేయర్‌గా ఉన్నాడు. 2004లో ధోని జాతీయ జట్టులోకి అడుగుపెట్టినప్పుడు, అప్పటి 23 ఏళ్ల యువకుడు వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఈ స్థాయికి ఎదుగుతాడని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. స్టంప్స్ వెనుక ధోని టెక్నిక్ అసాధారణమైనది. అతను వికెట్ కీపింగ్‌ను ఒక ఆర్ట్‌గా మార్చాడు. డిఫ్లెక్షన్ల నుండి రనౌట్‌లను ప్రభావితం చేశాడు, రెప్పపాటులో స్టంపింగ్‌లను పూర్తి చేశాడు. తనదైన శైలితో క్యాచ్‌లను తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగలడు, ఇతరులతో కలిసి మంచి పార్ట్నర్‌షిప్‌లు నిర్మించగలడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
ఓటీటీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్..
ఓటీటీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్..
చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం..
చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం..