టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే రాంచీలోని తన నివాసంలో ఉన్న గ్యారేజీలో హమ్మర్, ఫోర్డ్ మస్టాంగ్ వంటి ఖరీదైన కార్లతో పాటు లెక్కలేనన్నీ బైకులు ఉన్నాయి. తాజాగా ధోని గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. కియాకు చెందిన ‘EV6′(SUV) కారుని కొనుగోలు చేసాడీ జార్ఖండ్ డైనమెట్. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కొనడమే ఆలస్యం తన కొత్త కారులో షికారులకు బయలు దేరాడీ మాజీ కెప్టెన్. తన సహచరులు రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌లను వెంటపెట్టుకుని కొత్త కారులో ఎంచెక్కా చక్కర్లు కొట్టాడు. ఈ ఎలక్ట్రిక్ కారును ధోనినే స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
కాగా రాంచీలో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఇక ఇదే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్న కేదార్ కూడా రాంచీలోనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇద్దరినీ సరదాగా తన కారులో షికారుకు తీసుకెళ్లాడు ధోని. ఇక కారు విషయానికొస్తే.. కొరియన్ కంపెనీ కియాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీని 50 kW ఛార్జర్‌తో ఛార్జ్ చేయడం ద్వారా 73 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ధర గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం భారతదేశంలో EV6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.95 లక్షల నుండి మొదలై రూ. 64.95 లక్షల వరకు ఉంది.
New Car in the house babyyy @msdhoni ?pic.twitter.com/73ZZMxF4hv
— Best of MS Dhoni. (@BestOfMSD) November 17, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..