IPL 2023: కొడితే కొట్టాలిరా… సిక్స్‌ కొట్టాలి.. ఐపీఎల్ ఫస్ట్‌ హాఫ్‌లో అత్యధిక సిక్సర్ల వీరులు వీరే..

|

Apr 27, 2023 | 4:02 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్‌ హాఫ్‌ పూర్తయింది. అన్ని జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడగా, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఐదు విజయాలు, రెండు ఓటములతో ధోని సేన టైటిల్‌ గెల్చుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

IPL 2023: కొడితే కొట్టాలిరా... సిక్స్‌ కొట్టాలి.. ఐపీఎల్ ఫస్ట్‌ హాఫ్‌లో అత్యధిక సిక్సర్ల వీరులు వీరే..
Ipl 2023
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్‌ హాఫ్‌ పూర్తయింది. అన్ని జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడగా, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఐదు విజయాలు, రెండు ఓటములతో ధోని సేన టైటిల్‌ గెల్చుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ (2), రాజస్థాన్‌ రాయల్స్‌ (3), లక్నో సూపర్ జెయింట్స్‌ (4), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (5) టాప్‌-5లో కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. 7 మ్యాచులు ఆడిన వార్నర్‌ సేన ఐదు పరాజయాలతో టోర్ని నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటేఎప్పటిలాగే ధనాధన్‌ లీగ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో అత్యధిక సిక్సర్ల కొట్టిన ప్లేయర్ల లిస్టులో బెంగళూరుదే అగ్రస్థానం. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (25), మ్యాక్స్‌వెల్‌(23) ఈ లిస్టులో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అలాగే స్టాండింగ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా టాప్‌-10 లిస్టులో నిలిచాడు.

అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-10 ఆటగాళ్లు వీరే (మొదటి 7 మ్యాచ్‌లు):

1. డుప్లెసిస్‌ (ఆర్సీబీ)- 25 సిక్సర్లు

2. మ్యాక్స్‌వెల్‌(ఆర్సీబీ)- 23

ఇవి కూడా చదవండి

3. రింకూసింగ్ (కేకేఆర్‌)- 17

4. రుతురాజ్‌ గైక్వాడ్‌ (సీఎస్కే)- 17

5. వెంకటేశ్‌ అయ్యర్‌(కేకేఆర్‌) – 16

6. కైల్‌ మేయర్స్‌ (ఎల్‌ ఎస్‌జీ)- 16

7. నికోలస్‌ పూరన్‌ (ఎల్‌ ఎస్‌జీ) – 15

8. శివమ్‌ దూబే (సీఎస్కే)- 15

9. షిమ్రాన్‌ హెట్మయిర్‌ (ఆర్‌ఆర్‌)-15

10. నితీశ్‌ రాణా (కేకేఆర్‌)- 15

ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ 11 సిక్స్‌లతో 15వ స్థానంలో ఉండగా.. 10 సిక్స్‌లతో రోహిత్‌ శర్మ 19వ స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..