AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!

Test Bowling Records: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 7339.5 ఓవర్లతో అగ్రస్థానంలో ఉండగా, అనిల్ కుంబ్లే 6808.2 ఓవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్, నాథన్ లయాన్, స్టువర్ట్ బ్రాడ్, కోర్ట్నీ వాల్ష్ కూడా టాప్-7లో చోటు దక్కించుకున్నారు. వారి బౌలింగ్ రికార్డులు ఇప్పటికీ అద్భుతంగా నిలిచాయి.

Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!
Muttiah Muralitharan
Rakesh
|

Updated on: Aug 25, 2026 | 10:29 AM

Share

Test Bowling Records : టెస్ట్ క్రికెట్‌లో విజయం సాధించాలంటే బౌలర్లు లాంగ్ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. రోజంతా మైదానంలో నిలబడి వేల ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో నిలవగా, భారత జంబో అనిల్ కుంబ్లే రెండో స్థానాన్ని ఆక్రమించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.

1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 7339.5 ఓవర్లు

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా చరిత్ర పుటల్లో నిలిచారు. 1992 నుంచి 2010 మధ్యకాలంలో 133 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన ఏకంగా 7339.5 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో 22.73 సగటుతో 800 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందని ఎత్తులో నిలిచారు.

2. అనిల్ కుంబ్లే (భారత్) – 6808.2 ఓవర్లు

భారత మాజీ లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఈ చారిత్రక రికార్డుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1990 నుంచి 2008 వరకు 132 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కుంబ్లే 6808.2 ఓవర్లు విసిరారు. 29.65 సగటుతో 619 వికెట్లు తీసి భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచారు.

ఇది కూడా చదవండి: IND vs SL: కొలంబో టెస్ట్‌లో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. గ్లౌజులు విసిరికొట్టిన శ్రీలంక ప్లేయర్

3. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 6784.1 ఓవర్లు

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 1992 నుంచి 2007 వరకు 145 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 6784.1 ఓవర్లు బౌలింగ్ చేశారు. 25.42 సగటుతో 708 వికెట్లు సాధించి ప్రపంచ క్రికెట్‌ను ఏలారు.

4. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) – 6672.5 ఓవర్లు

ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సుదీర్ఘమైన టెస్ట్ కెరీర్‌లో 6672.5 ఓవర్లు వేశారు. 2003 నుంచి 2024 వరకు అత్యధికంగా 188 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 26.46 సగటుతో 704 వికెట్లు తీశారు. పేస్ బౌలర్లలో అత్యధిక ఓవర్లు వేసిన రికార్డు ఈయన పేరు మీదే ఉంది.

5. నాథన్ లయాన్ (ఆస్ట్రేలియా) – 5853.1 ఓవర్లు

ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయాన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2011 నుంచి ఇప్పటివరకు 143 టెస్టుల్లో 5853.1 ఓవర్లు బౌలింగ్ చేశారు. లయాన్ ఖాతాలో 30.21 సగటుతో 571 వికెట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ?

6. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 5616.2 ఓవర్లు

ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ క్రికెట్‌లో 5616.2 ఓవర్లు బౌలింగ్ చేశారు. 2007 నుంచి 2023 వరకు 167 టెస్టుల్లో ఆడి 27.68 సగటుతో 604 వికెట్లు సాధించారు.

7. కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 5003.1 ఓవర్లు

వెస్టిండీస్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ ఏడో స్థానంలో నిలిచారు. 1984 నుంచి 2001 వరకు 132 టెస్టుల్లో 5003.1 ఓవర్లు వేసి 24.44 సగటుతో 519 వికెట్లు పడగొట్టారు.

టెస్ట్ క్రికెట్‌లో వేల ఓవర్లు విసరడం అనేది బౌలర్ల శారీరక దృఢత్వానికి, వారిలోని అంకితభావానికి నిదర్శనం. ఈ దిగ్గజాలు నెలకొల్పిన ఓవర్ల రికార్డులను తిరగరాయడం ఆధునిక క్రికెట్‌లో అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us