క్రికెట్ గ్రౌండ్‌లోకి కుక్కలు, పక్షులు రావడం కొత్తేమీ కాదు. ఒక్కోసారి లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా పాములు వచ్చిన సందర్భాలున్నాయి. వాటిని చూసి గ్రౌండ్‌లోని ఆటగాళ్లు, అంపైర్లు జడుసుకున్నారు కూడా. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ అనుకోని అతిథి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో మానిటర్ లిజార్డ్ (ఉడుము) ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించి ఆటగాళ్లను కాసేపు భయపెట్టింది. ఈ బల్లిని చూసి ఆటగాళ్ళే కాదు అంపైర్లకు కూడా చెమటలు పట్టాయి. దీంతో కొంతసేపు ఆటను నిలిపివేశారు. అయితే ఇది మైదానంలోని ఆటగాళ్లకు, ప్రేక్షకులను ఎలాంటి హాని తలపెట్టలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఉడుములు ఆసియా, దక్షిణాఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని విషపు బల్లి అని కూడా అంటారు.అయితే అనుకోకుండా శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఉడుము గ్రౌండ్‌లోకి అడుగు పెట్టింది. దిగింది.
ఉడుమును చూడగానే బౌండరీ దగ్గర నిలబడి ఉన్న చాలా మంది ఆటగాళ్లు,చ అలాగే అంపైర్లు భయపడ్డారు. దీని కారణంగా కొంతసేపు మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే కొద్దిసేపటికే అదే స్వతహాగా మైదానాన్ని వీడింది. ఆ తర్వాత మళ్లీ ఆట మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇక్కడ టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. దీంతో నిన్నటి నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా శ్రీలంక ఇప్పటి వరకు 400కు పైగా పరుగులు చేసింది. తద్వారా ఇప్పటివరకు ఆఫ్ఘనిస్థాన్‌పై 200 కంటే ఎక్కువ పరుగుల ఆధిక్యం సంపాదించింది.
We had an uninvited guest on the field today 🦎😄#SonySportsNetwork #SLvAFG pic.twitter.com/1LvDkLmXij
— Sony Sports Network (@SonySportsNetwk) February 3, 2024
Match stopped in Sri Lanka due to a monitor lizard on the field. pic.twitter.com/RYI1UeMpNU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..