Mohammed Siraj : ఎప్పుడూ అలాగే ఉంటాడు అతడో గుర్రం.. ఏంటి సిరాజ్ బ్రో అంత మాట అనేశావ్

మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను 'గుర్రం' అని ప్రశంసించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో సిరాజ్ 6 వికెట్లు, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 407 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 180 పరుగుల ఆధిక్యం సాధించింది.

Mohammed Siraj : ఎప్పుడూ అలాగే ఉంటాడు అతడో గుర్రం.. ఏంటి సిరాజ్ బ్రో అంత మాట అనేశావ్
Mohammed Siraj Akash Deep

Updated on: Jul 05, 2025 | 4:17 PM

Mohammed Siraj : ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. భారత జట్టుకు కొత్త బాల్ లభించగానే దూకుడు పెంచి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌ను 407 పరుగులకు పరిమితం చేశాడు. దీంతో టీమ్ ఇండియాకు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇప్పుడు భారత్ విజయం వైపు దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ఆరు వికెట్లు తీసిన తర్వాత సిరాజ్ ఆ బాల్‌ను తన దగ్గర ఉంచుకొని టీమ్ ఇండియాలోని ఒక ఫాస్ట్ బౌలర్‌ను ‘గుర్రం’గా సంబోధించాడు. ఇంతకీ అతను ఎవరిని, ఎందుకు అలా అన్నాడో చూద్దాం.

ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 19.3 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తో పాటు ఇంగ్లండ్‌లో తన కెరీర్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నాలుగు వికెట్లు తీశాడు. బీసీసీఐ విడుదల చేసిన ఒక వీడియోలో సిరాజ్ ఆకాశ్‌దీప్‌ గురించి మాట్లాడుతూ.. అతను గుర్రం లాంటి వాడు. ఎప్పుడు అవకాశం కోసం రెడీగా ఉంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా అద్భుతంగా రాణిస్తాడు. అతనితో కలిసి బౌలింగ్ చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది. అతనిలో ఎంత ఆకలి ఉందో ఈ మ్యాచులో చూపించాడు.” అని ప్రశంసించాడు.

దీనిపై ఆకాశ్‌దీప్ కూడా స్పందించాడు.. ‘‘సిరాజ్ భాయ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదట్లో అతను రన్స్ ఎక్కువగా ఇవ్వలేదు. దానివల్ల బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ఆ ప్రయోజనమే నాకు లభించింది. అందుకే మొదట్లోనే రెండు వికెట్లు తీయగలిగాను.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్(269 పరుగులు) అద్భుతమైన బ్యాటింగ్‌తో 587 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. దీనికి సమాధానంగా.. ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాత జేమీ స్మిత్(184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158 పరుగులు) సెంచరీలు సాధించి, ఇంగ్లండ్ స్కోర్‌ను భారత్ స్కోర్‌కు చాలా దగ్గరగా తీసుకువచ్చారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, ఇంగ్లండ్‌పై 244 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పుడు టీమ్ ఇండియా భారీ టార్గెట్‌ను ఇచ్చి, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించాలని చూస్తోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..