Team India: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు కరేబియన్ దీవుల్లో కాలు మోపిన భారత ఆటగాల్లు ముందుగా బార్బడోస్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ, అశ్విన్, ఇషాన్ కిషన్ వంటి పలువురు టీమిండియా ఆటగాళ్లు.. ప్రాక్టీస్ చూడడానికి వచ్చిన ఔత్సాహిక యువ క్రికెటర్లకు మనోళ్లు ఆట గురించి తమ అనుభవం మేరకు సలహాలను అందించారు. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలతో పాటు సరదాగా సంభాషించుకున్నారు. అయితే హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం స్థానిక ఆటగాళ్లకు బ్యాట్, షూస్ అందజేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది.
Kind gestures 👌
Autographs ✍️
Selfies 🤳
Dressing room meets 🤝#TeamIndia make it special for the local players and fans in Barbados 🤗 #WIvIND pic.twitter.com/TaWmeqrNS6 ఇవి కూడా చదవండి— BCCI (@BCCI) July 7, 2023
ఇక టూర్ విషయానికి వస్తే టెస్ట్ టీమ్‌లో చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాడికి అవకాశం లభించలేదు. ఇంకా రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ వంటి యువ ఆటగాళ్లకు టెస్ట్ స్క్వాడ్‌లో అవకాశం లభించింది. మరోవైపు టీ20 టీమ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం లభించలేదు. ఈ మేరకు హార్దిక్ పాండ్యా భారత జట్టును నడిపించనున్నాడు.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ః
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..