IPL 2023 Points Table: పంజాబ్, ముంబై విజయాలతో.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు..

|

May 01, 2023 | 5:59 AM

MI vs RR: ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు 213 పరుగుల విజయ లక్ష్యం ఉంది. దీంతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయానికి హీరో టిమ్ డేవిడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

IPL 2023 Points Table: పంజాబ్, ముంబై విజయాలతో.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు..
Ipl Points Table
Follow us on

IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన 213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అదే సమయంలో ఈ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే, ఈ విజయం తర్వాత ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.

పాయింట్ల పట్టికలో కీలక మార్పులు..

ముంబై ఇండియన్స్‌పై ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో నిలిచింది. అయితే, గుజరాత్ టైటాన్స్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. ఇది కాకుండా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలో 10 పాయింట్లతో నిలిచాయి.

పాయింట్ల పట్టికలో ఇతర జట్ల పరిస్థితి..

నితీష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరి స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు సాధించింది. ఇది కాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో ఉంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించింది. అయితే, గుజరాత్ టైటాన్స్‌తో పాటు, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు IPL 2023 సీజన్‌లో టాప్-4 జట్లలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..