MI vs RCB Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకునేనాా?

IPL ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

MI vs RCB Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకునేనాా?
Mi Vs Rcb

Updated on: Apr 12, 2026 | 7:22 PM

IPL ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఆర్‌సిబి రెండు విజయాలతో సీజన్‌ను ప్రారంభించినప్పటికీ, తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) చేతిలో ఓడిపోయింది. ఎంఐ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఆర్‌ఆర్ చేతిలో ఓడిపోయింది. ముంబై జట్టు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చవిచూసింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మంగేష్ యాదవ్.

ముంబై ఇండియన్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బాష్, అశ్వనీ కుమార్, రఘు శర్మ, రాజ్ బావా.

Follow Us