MI vs KKR: డెబ్యూలో 4 వికెట్లతో అశ్విని అరుదైన రికార్డ్‌.. 116కే కేకేఆర్ ఆలౌట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న అశ్విని కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆండ్రీ రస్సెల్ (5 పరుగులు), మనీష్ పాండే (19 పరుగులు), రింకు సింగ్ (17 పరుగులు), కెప్టెన్ అజింక్య రహానె (11 పరుగులు) వికెట్లు ఉన్నాయి.

MI vs KKR: డెబ్యూలో 4 వికెట్లతో అశ్విని అరుదైన రికార్డ్‌.. 116కే కేకేఆర్ ఆలౌట్
Mi Vs Kkr

Updated on: Mar 31, 2025 | 9:16 PM

Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: IPL 2025లో 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 116 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో ముంబైకి 117 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది.

అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న అశ్విని కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆండ్రీ రస్సెల్ (5 పరుగులు), మనీష్ పాండే (19 పరుగులు), రింకు సింగ్ (17 పరుగులు), కెప్టెన్ అజింక్య రహానె (11 పరుగులు) వికెట్లు ఉన్నాయి. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేశ్ పుత్తూర్, మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కోల్‌కతా జట్టులో అంగ్‌క్రిష్ రఘువంశీ అత్యధికంగా 26 పరుగులు చేయగా, రమణ్‌దీప్ సింగ్ 22 పరుగులు చేశాడు.

ఇరు జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (సి), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అన్రిచ్ నార్ట్జే, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, లువ్నిత్ సిసోడియా.

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, రాబిన్ మింజ్, సత్యనారాయణ రాజు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..