Tim David In MLC 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ మేజర్ లీగ్ క్రికెట్‌లో MI న్యూయార్క్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో డేవిడ్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతను తన జట్టుకు ఫినిషర్ రోల్‌కి న్యాయం చేశాడు.
టిమ్ ఇప్పటివరకు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో డేవిడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 * పరుగులు చేయగా, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 48 * పరుగులు చేశాడు. టోర్నీలో డేవిడ్ ఇప్పటివరకు 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను 189.29 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అదే సమయంలో రెండవ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 228.57గా నిలిచింది. ఎంఐ న్యూయార్క్ తొలి మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 105 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
2023లో ఆడిన IPL 16లో 15 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన టిమ్ డేవిడ్ 158.22 స్ట్రైక్ రేట్‌తో 231 పరుగులు చేశాడు. అందులో అతని అత్యధిక స్కోరు 45 నాటౌట్. ఈ సమయంలో అతని బ్యాట్‌లో 12 ఫోర్లు, 15 సిక్సర్లు వచ్చాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..