Watch Video: చిరుతలా గాల్లోకి దూకి.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. జాంటీరోడ్స్ 2.0 వర్షన్ అంటోన్న నెటిజన్లు..

|

Aug 18, 2022 | 12:42 PM

ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒంటిచేత్తో గాల్లోకి ఎగిరి మరీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంగ్లండ్‌కు చెందిన ర్యాన్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

Watch Video: చిరుతలా గాల్లోకి దూకి.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. జాంటీరోడ్స్ 2.0 వర్షన్ అంటోన్న నెటిజన్లు..
Surrey Vs Somerset Viral Video
Follow us on

నెట్టింట్లో ప్రతినిత్యం ఎన్నో వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. వీటిలో క్రికెట్ వీడియోలు కూడా ప్రధానంగా కనిపిస్తుంటాయి. నిత్యంఏదో ఒక చోట క్రికెట్ జరుగుతూనే ఉంటుంది. లోకల్ మ్యాచ్‌ల నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌ల వరకు ఎన్నో జరుగుతుంటాయి. వీటిలో కొన్ని స్టన్నింగ్ మూమెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒంటిచేత్తో గాల్లోకి ఎగిరి మరీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంగ్లండ్‌కు చెందిన ర్యాన్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్‌లో సర్రే వర్సెస్ సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత క్యాచ్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ 16 సెకన్ల వీడియోను సోమర్‌సెట్ క్రికెట్ షేర్ చేసింది. చిరుతలా గాల్లోకి ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ చూసి బ్యాటర్ కూడా పరేషాన్ అయ్యాడు. ఇది చూసిన ఫీల్డర్లు, ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా షాక్‌లోనే ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి

సర్రే ఓపెనర్ రియాన్ పటేల్ స్ట్రైక్‌లో ఉన్నాడు. బాల్ పడిన వెంటనే, బ్యాట్స్‌మెన్ రియాన్ భారీ షాట్ ప్లాన్ చేశాడు. కానీ, బంతి బ్యాట్ అంచుని తీసుకొని స్లిప్ వైపు వెళ్లింది. అక్కడే నిల్చుని ఉన్న మాట్ రెన్‌షా దూరంగా వెళ్తోన్న బంతివైపు చిరుతలా దూకాడు. గాల్లోకి అమాంతం దూకి, ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు.

16 సెకన్ల వీడియోలో..

రెన్‌షా క్యాచ్ పట్టిన తర్వాత ఫీల్డర్లు అంతా ఆశ్యర్యపోతూ, ఆతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, వేడుకలు చేసుకున్నారు. ముందుగా సహచర వికెట్ కీపర్లు వచ్చి రెన్షాను కౌగిలించుకున్నారు. ఆ తర్వాత మిగతా సహచరులు అతడిని చుట్టుముట్టి అద్భుతమైన క్యాచ్‌కి అభినందనలు తెలిపారు. దీంతో సోమర్‌సెట్‌ లీగ్‌లో రెండవ విజయాన్ని దక్కించుకుంది. అలాగే సర్రే జట్టు రెండోసారి ఓటమిపాలైంది. రియాన్ పటేల్ 22 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. ఈ సమయంలో అతను 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సహాయంతో 13 పరుగులు చేశాడు.