వచ్చే నెల 31 నుంచి ఐపీఎల్- 2023 సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్టు కూర్పు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చలు జరుపుతున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గత సీజన్‌లో మాదిరిగానే ఇప్పుడు కూడా గాయాలు వేధిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకుండానే ఆ జట్టు స్టార్ పేసర్ కైల్ జెమీసన్ గాయంతో ఆడేది అనుమానంగానే ఉంది. ఏడాది తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చేందుకు జెమీసన్ యత్నించినా నడుము నొప్పి మళ్లీ తిరగబెట్టింది. గతేడాది న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా ఆ సిరీస్‌లో తొలి టెస్టు ఆడిన జెమీసన్.. రెండో టెస్టుకు గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. తిరిగి ఇటీవలే ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ ఆడుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు.
అయితే ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ఆడిన జెమీసన్.. తొలి టెస్టుకు ముందుగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా జెమీసన్‌కు మరోసారి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆపరేషన్ తర్వాత అతడికి మూడు నుంచి నాలుగు నెలల పాటు విరామం తీసుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం. ఐసీసీ కూడా తన ట్విటర్ ఖాతాలో ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది. దీంతో జెమీసన్.. ఐపీఎల్ 16వ సీజన్ మొత్తం అందుబాటులో ఉండడని తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉన్న జెమీసన్ లేకపోవడం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బే అని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
?News Update ?
Bad News for CSK ahead of IPL 2023, Kyle Jamieson ruled out of IPL 2023 due to injury.#Cricket #cricketnews #IPL2023 #CSK #IPL #KyleJamieson @ChennaiIPL @IPL pic.twitter.com/SvE0wZGzIM
— CricInformer (@CricInformer) February 20, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..