MS Dhoni: రూ. 15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎంఎస్ ధోని.. లిస్టులో మాజీ ప్రపంచకప్ విజేత కూడా

|

Jan 05, 2024 | 3:48 PM

Mahendra Singh Dhoni: ఎంఎస్ ధోని ఇటీవలే తన నూతన సంవత్సరాన్ని దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ధోనీ తన కుటుంబం, స్నేహితులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ పర్యటనలో ధోనీతో పాటు భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. ధోనీ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో క్రిస్మస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు.

MS Dhoni: రూ. 15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎంఎస్ ధోని.. లిస్టులో మాజీ ప్రపంచకప్ విజేత కూడా
Dhoni Jawa Bike
Follow us on

Mahendra Singh Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్‌పై రూ.15 కోట్లు ఆర్థిక మోసం చేసినట్లు ఓ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. అయితే, ఈ జాబితాలో మిహిర్ దివాకర్ మాత్రమే కాకుండా, టీమిండియా మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సౌమ్య బిస్వాస్ పేరు కూడా ఉండడం గమానార్హం. ఈ మేరకు ఎంఎస్ ధోని కోర్టును ఆశ్రయించాడు. కెప్టెన్ కూల్ రాంచీ కోర్టులో ఈ కేసు వేశారు.

2017లో ఎంఎస్ ధోని పేరుతో గ్లోబల్ క్రికెట్ అకాడమీని నిర్మించేందుకు మిహిర్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నాడంట. దేశ, విదేశాల్లో అనేక చోట్ల అకాడమీకి భూమి కొనుగోలు చేసినా.. అకాడమీ పనులు మాత్రం ముందుకు సాగలేదంట. ఒప్పందం ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ధోనీకి డివిడెండ్ చెల్లించాల్సి ఉంది. కానీ, మిహిర్ దివాకర్, సౌమ్య బిస్వాస్ ఆ షరతును నెరవేర్చలేకపోయారు. దాంతో ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

అంతకు ముందు ధోనీ ఆగస్ట్ 15, 2021న ఆర్కా స్పోర్ట్స్‌కు మంజూరు చేసిన అధికార లేఖను ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత అనేక చట్టపరమైన నోటీసులను పంపించాడంట. కానీ, ప్రయోజనం లేకపోయినట్లు అందులో పేర్కొన్నాడు.

విధి అసోసియేట్స్ ద్వారా ఎంఎస్ ధోనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దయానంద్ సింగ్, ఆర్కా స్పోర్ట్స్ ద్వారా తాము మోసపోయామని గ్రహించి రూ. 15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఎంఎస్ ధోని ఇటీవలే తన నూతన సంవత్సరాన్ని దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ధోనీ తన కుటుంబం, స్నేహితులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ పర్యటనలో ధోనీతో పాటు భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. ధోనీ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో క్రిస్మస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు.

మొదటిసారిగా డిసెంబర్ 19న UAEలో జరిగిన IPL 2024 మినీ వేలం కోసం దుబాయ్ చేరుకున్న తర్వాత రిషబ్ పంత్ ఎంఎస్‌ ధోనితో చేరాడు. డిసెంబరు 2022లో కారు ప్రమాదంలో గాయపడి, కోలుకున్న పంత్.. ప్రస్తుతం రీఎంట్రీ కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..