12 ఫోర్లు, 5 సిక్సులతో తుఫాన్ సెంచరీ.. 172 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్ల బెండు తీసిన ధోనీ టీంమేట్..

|

Oct 12, 2022 | 4:55 PM

Ruturaj Gaikwad: రితురాజ్ గైక్వాడ్ 65 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో అతను కేవలం 59 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

12 ఫోర్లు, 5 సిక్సులతో తుఫాన్ సెంచరీ.. 172 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్ల బెండు తీసిన ధోనీ టీంమేట్..
ruturaj gaikwad
Follow us on

ధోని తీర్చిదిద్దిన ఓ బ్యాటర్.. ప్రస్తుతం సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో మంటలు పుట్టిస్తున్నాడు. తన బ్యాట్‌తో బౌలర్లపై విరుచుకపడుతూ, పరుగులు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ సెంచరీ చేసి, సెలక్టర్ల చూపును ఆకర్షించాడు. ఆయనెవరో కాదు.. రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతోన్న గైక్వాడ్.. తన అద్భుత ప్రదర్శనతో ఎన్నో తుఫాన్ ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు. కాగా, సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడుతోన్న గైక్వాడ్.. ఓ తుఫాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సర్వీసెస్‌పై అసమానమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు మిగతా బ్యాటర్స్ వరుసగా పెవిలియన్ చురుతోన్న.. మరో ఎండ్‌లో నిలబడి తుఫాన్ వేగంతో సెంచరీ పూర్తి చేశాడు. అతని అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఫలితంగా మహారాష్ట్ర జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేయగలిగింది.

65 బంతుల్లో 112 పరుగులు..

సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. రితురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కేవలం 65 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో అతని స్ట్రైక్ రేట్ 172.30గా ఉంది. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌లో గైక్వాడ్ కేవలం 59 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. గైక్వాడ్ ఈ సెంచరీతో మ్యాచ్‌లో మహారాష్ట్ర పటిష్ట స్థితిలో నిలిపాడు. కానీ, సర్వీసెస్‌ జట్టు ఏమాత్రం తడబడకుండా ధీటుగా బ్యాటింగ్ చేయడంతో.. రుతురాజ్ సెంచరీ ఇన్నింగ్స్ మరుగున పడిపోయింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి, ఈ టార్గెట్‌ను సాధించింది.

కేవలం 17 బంతుల్లో 78 పరుగులు..

రితురాజ్ గైక్వాడ్ తన సెంచరీతో కేవలం 17 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అంటే ఇవన్నీ బౌండరీలతో వచ్చిన పరుగులు అన్నమాట. సిక్సర్లతో 30 పరుగులు చేయగా, ఫోర్లతో 40 పరుగులు చేశాడు. ఈ రెండింటి మొత్తం 78 పరుగులు అంటే, గైక్వాడ్ 12 ఫోర్లు, 5 సిక్సులు బాదేశాడు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర తరపున రితురాజ్ గైక్వాడ్ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ బ్యాట్‌ ఆకట్టుకోలేదు. రెండో ఓపెనర్ యష్ నహర్ కేవలం 1 పరుగు, రాహుల్ త్రిపాఠి 19 పరుగులు చేశారు. అదే సమయంలో 24 పరుగులు చేసిన నౌషాద్ షేక్ జట్టులో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

సర్వీసెస్ బౌలర్లపై గైక్వాడ్ ప్రతాపం..

మోహిత్ కుమార్, పుల్కిత్ నగర్ సర్వీసెస్‌కు ఇద్దరు విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు. గైక్వాడ్‌ బ్యాట్‌ దెబ్బకు వీరిద్దరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మహారాష్ట్రలో పడిన 6 వికెట్లలో 5 వికెట్లు వీరివే. మోహిత్ 4 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, పుల్కిత్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.