Delhi Capitals vs Lucknow Super Giants, 4th Match Preview: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఐపీఎల్ (IPL) 2025లో తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. ఈసారి ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తుండగా, రిషబ్ పంత్ లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. పంత్ తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ కాకుండా వేరే జట్టు తరపున ఆడనున్నాడు. గత సీజన్‌లో అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, ఇప్పుడు అతను లక్నో జట్టుకు నాయకత్వం వహించే సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది.
హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ వీడియో..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ పంత్‌ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. దీంతో అతను IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయినందున, లక్నో జట్టు పంత్ నుంచి చాలా అంచనాలను కలిగి ఉంటుంది. మరోవైపు, మూడు సీజన్ల పాటు లక్నో జట్టుకు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈసారి రాహుల్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడనున్నాడు. ఎందుకంటే, అతనిపై ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యత లేదు. భారత జట్టులోని ఇద్దరు దిగ్గజాలు రాహుల్, పంత్ ఇప్పుడు క్రికెట్ మైదానంలో ముఖాముఖిగా తలపడనున్నారు.
ఎందుకంటే, విదేశీ, భారత ఆటగాళ్ల మంచి కలయికను కలిగి ఉంది. బ్యాటింగ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ అనుభవం ఢిల్లీకి ప్రయోజనం చేకూరుస్తుండగా, బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్‌తో ఢిల్లీ జట్టు బలమైన మిడిల్ ఆర్డర్‌ను కలిగి ఉంది. ఇందులో రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ కూడా ఉన్నారు. ఢిల్లీ బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ స్పిన్ విభాగం అక్షర్, కుల్దీప్ యాదవ్‌లలో ఇద్దరు అనుభవజ్ఞులైన భారత స్పిన్నర్లు ఉన్నారు. స్టార్క్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో టి నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర ఉన్నారు.
లక్నో తమ భారత ఆటగాళ్ళు విదేశీ ఆటగాళ్లతో బాగా కలిసిపోతారని ఆశిస్తుంది. విదేశీ ఆటగాళ్ళలో, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా బౌలింగ్ చేయకూడదని నిర్ణయించడంతో.. అతను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, లక్నో దక్షిణాఫ్రికా జంట డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ నుంచి మంచి ప్రదర్శనను ఆశిస్తుంది. నికోలస్ పూరన్ రూపంలో, లక్నోలో ఒక తుఫాన్ బ్యాట్స్‌మన్ ఉన్నాడు, అతను ఒంటరిగా మ్యాచ్‌ను తిప్పికొట్టగలడు. అతనితో పాటు, లక్నో జట్టులో ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ రూపంలో మంచి భారత బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అయితే, భారత ఫాస్ట్ బౌలర్లు మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, ఆకాశ్‌దీప్ ఇంకా గాయాల నుంచి కోలుకోవడంతో బౌలింగ్ విభాగం నుంచి లక్నో ఆందోళన పడుతోంది. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా లక్నో బలాన్ని పొందింది. గాయపడిన ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో లక్నో, ఢిల్లీ జట్లలో ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఓసారి చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్: జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి. నటరాజన్.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఆర్యన్ జుయల్, రిషబ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..