LSG Wants to Buy Rohit Sharma in IPL 2025 Mega Auction: ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. చివరి మెగా వేలం IPL 2022లో జరిగింది. మెగా వేలానికి ముందే చాలా మంది కీలక ఆటగాళ్లను విడుదల చేస్తారని భావిస్తున్నారు. రోహిత్ శర్మ కూడా ఈసారి వేలంలో పాల్గొంటాడని చాలా మీడియా నివేదికలలో పేర్కొంటున్నాయి. హిట్‌మ్యాన్ IPL అత్యంత విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా పేరుగాంచాడు. అతను ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టి, మెగా వేలంలో అమ్మకానికి వస్తే, అతనిని వేలం వేయడానికి ఇష్టపడని ఫ్రాంచైజీ ఏదీ ఉండదు.
రోహిత్ శర్మ 2011 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. కానీ, MI ఫ్రాంచైజీ రాబోయే వేలానికి ముందు విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. రోహిత్ విడుదల కోసం ఇతర ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. అందులో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒకటి. రోహిత్ వేలంలోకి వస్తే స్వాగతించేందుకు ఫ్రాంచైజీ సిద్ధంగా ఉందని లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తెలిపారు.
ఓ ఇంటర్వ్యూలో రోడ్స్ మాట్లాడుతూ, ‘రోహిత్ శర్మ వేలంలోకి వస్తే, LSG అతన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. అతను చాలా గొప్ప ఆటగాడు, అతన్ని కొనుగోలు చేయడానికి ప్రతి జట్టు సంతోషంగా ఉంటుందని తెలిపాడు.
వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఎస్‌జీ రూ.50 కోట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. IPL 2025 మెగా వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కూడా తమ పర్సు మనీలో రూ. 50 కోట్లు ఆదా చేసిందని ఇటీవల ఇటువంటి నివేదికలు వచ్చాయి. అంటే ఈసారి వేలంలో ఉత్కంఠ అన్ని హద్దులు దాటుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.
IPL 2025కి ముందు, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తమ మెంటార్‌గా నియమించుకుంది. IPL 2023లో, LSG మెంటార్ లేకుండా ఆడింది. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. జహీర్ జట్టులో భాగమైనందుకు రోడ్స్ చాలా సంతోషంగా ఉన్నాడు. భారత లెజెండ్ మొదటిసారి LSG ఫైనల్‌కు చేరుకోవడంలో సహాయపడతాడని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..