LSG vs SRH Highlights: లక్కో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమ్ 5 వికెట్ల తేడాతో సునాయసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని లక్నో టీమ్ 4 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ క్రమంలో లక్కో తరఫున కెప్టెన్ రాహుల్ 35, కృనాల్ పాండ్యా 34 పరుగులతో రాణించారు. దీంతో లక్నో విజయం ఖరారైంది. అయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున రాహుల్ త్రిపాఠి 41 బంతుల్లో 35, అన్మోల్‌ప్రీత్ సింగ్ 26 బంతుల్లో 31 పరుగులు చేశారు. కృనాల్ పాండ్యా లక్నో తరపున మూడు వికెట్లను దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన లక్నోకి శుభారంభం లభించకపోయినా.. బ్యాటర్లు నిలకడగా రాణించారు. ఓపెనర్‌గా వచ్చిన కేల్ మేయర్స్ 5వ ఓవర్లోనే మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాట పట్టాడు. అయితే అతనితో పాటు వచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం కెప్టెన్ బాధ్యతలను సరిగ్గా నిర్వహించాడు. 16 ఓవర్లు సాగిన లక్నో ఇన్నింగ్స్‌లో అతను 14.1 ఓవర్ వరకు క్రీజులోనే ఉండి 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 4 ఫోర్లు కూడా బాదాడు. తొలి వికెట్ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా విఫలమైనా ఆపై వచ్చిన కృనాల్ 34 పరుగులతో జట్టు విజయం కోసం తన వంతు పాత్ర పోషించి ఔటయ్యాడు. చివర్లో వచ్చిన నికోలస్ పూరన్ కూడా విన్నింగ్ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలా లక్నో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఇక హైదరాబాద్ తరఫున అదిల్ రషిద్ 2 వికెట్లు తీసుకోగా భువనేశ్వర్, ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసుకున్నారు.
Nicholas Pooran finishes things off in style.@LucknowIPL chase down the target with 4 overs to spare as they beat #SRH by 5 wickets.
Scorecard – https://t.co/7Mh0bHCrTi #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/STXF5KLMuI
— IndianPremierLeague (@IPL) April 7, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్(కీపర్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్.
లక్నో 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.
లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేశారు.
సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 122 పరుగుల టార్గెట్ నిలిచింది.
సన్‌రైజర్స్ జట్టు 17.2 ఓవర్లలో 5 వికెట్లకు 94 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నాడు.
రాహుల్ త్రిపాఠి 41 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అమిత్ మిశ్రా చేతిలో యశ్ ఠాకూర్‌కి చిక్కాడు. మిశ్రా 5 మీటర్ల డైవ్‌తో అద్భుత క్యాచ్‌కి చిక్కాడు.
సన్‌రైజర్స్ జట్టు 14 ఓవర్లలో నాలుగు వికెట్లకు 76 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.
సన్‌రైజర్స్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్లకు 69 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.
కృనాల్ పాండ్యా హ్యాట్రిక్ సాధించాడు. అతను అన్మోల్‌ప్రీత్ సింగ్ తర్వాత కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్‌ను అవుట్ చేశాడు.
3 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ ఔటయ్యాడు. బిష్ణోయ్‌కి ఇది తొలి వికెట్.
పాండ్యాకు ముగ్గురిని పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 0 పరుగులు, అన్మోల్ ప్రీత్ సింగ్ 31, మయాంక్ అగర్వాల్ 8 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టారు.
సన్‌రైజర్స్ జట్టు 9 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉన్నారు. 8 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్ చేతికి చిక్కాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ సున్నా వద్ద ఔటయ్యాడు. అతను కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పాండ్యాకు ఇది మూడో వికెట్. అన్మోల్‌ప్రీత్ సింగ్ 31, మయాంక్ అగర్వాల్ 8 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
సన్‌రైజర్స్ జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉన్నారు. 8 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్ చేతికి చిక్కాడు.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్(కీపర్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్.
ఐపీఎల్ 2023లో 10వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. మొన్నటి ఓటమి తర్వాత సొంత మైదానంలో గెలుపొందాలని కేఎల్ రాహుల్ జట్టు ఉవ్విళ్లూరుతోంది.