LSG vs RCB Prediction Playing XI IPL 2022: టైటిల్ రేసులో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. IPL 2022 లో ఈ జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడింది. అందులో నాలుగు గెలిచింది, రెండు ఓడింది. బెంగళూరు కొత్త కెప్టెన్‌తో ఈ సీజన్‌లో అడుగుపెట్టింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ కూడా సూపర్‌గా ఆడుతోంది. ఇది కూడా ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది,రెండు ఓడిపోయింది. అయితే లక్నో రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతుండగా బెంగళూరు మూడవ స్థానంలో కొనసాగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించగా, లక్నో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బెంగళూరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్నోను ఎదుర్కోవడం అంత సులభం కాదు. లక్నో కూడా బెంగళూరును తేలికగా తీసుకోవడానికి లేదు.
గత మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సోదరి మరణంతో హర్షల్ పటేల్ కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు కానీ చివరి మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. జట్టులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అనూజ్ రావత్ బాగా ఆడుతున్నాడు. షాబాజ్ అహ్మద్ కూడా ఆకట్టుకున్నాడు. దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. చాలాసార్లు జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఫినిషర్ పాత్రను పోషిస్తూ జట్టుని విజయతీరాలకు చేర్చుతున్నాడు.
లక్నో జట్టు చివరి మ్యాచ్‌లో గెలిచింది. అయితే ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర 12 సగటుతో పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ తన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేఅవకాశం ఉంది. అతని స్థానాన్ని ఆండ్రూ టై తీసుకోవచ్చు. మనీష్ పాండేకు అవకాశం ఇచ్చారు. 38 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తదుపరి మ్యాచ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయుష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (WK), మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.