LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు సూపర్ ఓవర్‌ వరకు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగా..లక్ష్యచేధనలో బరిలోకి దిగన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ కొట్టి మ్యాచ్‌ను పూర్తి చేశాడు.

LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ
Lsg Vs Kkr 2026 Highlights

Updated on: Apr 27, 2026 | 12:14 AM

ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో వేదికగా జరిగిన లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 3 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. ఇక లక్ష్య చేదనలో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు.

అయితే మొదట టాస్ గెలిచి లక్నో ఫీల్డింగ్ ఎంచుకోవడంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో రింకూ సింగ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేయగా, గ్రీన్ 21 బంతుల్లో 34 పరుగులు చేశారు. ఇక లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 5 వికెట్లు తీసి కోల్‌కతా దూకుడుకు అడ్డుకట్టవేశాడు.

ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్‌లు సైతం కోల్‌కతా బోలర్‌లకు దీటుగా సమాధానం చెప్పారు. లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ పెట్టాల్సి వచ్చింది. అటు సూపర్ ఓవర్‌లో సైతం మ్యాచ్ టెన్షన్‌గా సాగింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో కేవలం 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఇక 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మొదటి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టడంతో ఈజీగా విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us