ఐపీఎల్‌లో తొలిసారిగా ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గురువారం రిషబ్ పంత్(Rishabh Pant) కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో తలపడనుంది. రెండు వరుస విజయాల తర్వాత లక్నో జట్టు(Gujarat Titans)లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో మొదట డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని ఓడించి, ఆపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. అదే సమయంలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
లక్నో సూపర్ జెయింట్స్ రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విజయం, ఒక ఓటమితో ఏడో స్థానంలో ఉంది. గతంలో కూడా కెప్టెన్‌గా రాహుల్, రిషబ్ పంత్ ముఖాముఖిగా తలపడ్డారు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఇప్పుడు అతను లక్నో కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే జట్టును విజయాలతో ముందుకు తీసుకెళ్తున్నాడు.
మార్కస్ స్టోయినిస్ లక్నోలో భాగం కావడం లేదు..
బుధవారం ఇరు జట్ల ప్లేయింగ్ XIలో మార్పులు చూడవచ్చు. మార్కస్ స్టోయినిస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆడేందుకు అందుబాటులో లేడు. అయితే, మిగతా విదేశీ ఆటగాళ్లందరూ హాజరుకానున్నారు. స్టోయినిస్ పాకిస్థాన్ పర్యటన ముగిసిన తర్వాత జట్టులో చేరనున్నాడు. అయితే క్వారంటైన్‌లో ఉన్నందున, అతను ప్లేయింగ్ XIకి అందుబాటులో ఉండడు. మార్కస్ స్టోయినిస్ తిరిగి రాకముందే, క్వింటన్ డి కాక్, ఎవిన్ లూయిస్ అతని కోసం త్యాగం చేయాల్సి వస్తుంది.
ఢిల్లీకి తిరిగి వచ్చిన వార్నర్..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త ఏమిటంటే, ఆస్ట్రేలియా తుఫాన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. అతను జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరతాడని భావిస్తున్నారు. వార్నర్ తిరిగి జట్టులోకి వస్తే, అతను ఓపెనింగ్‌కు వెళ్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో ఢిల్లీ వెళితే.. టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్ మూడో స్థానంలో ఆడనున్నారు. ఎన్రిచ్ నార్కియా ఫిట్‌నెస్‌పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయినప్పటికీ అతను ఫిట్‌గా ఉంటే జట్టులో అతని స్థానం డిసైడ్ చేయనున్నారు. అయితే బౌలింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది.
లక్నో ప్రాబబుల్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, ఇవాన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
ఢిల్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, టిమ్ సీఫెర్ట్, కోన శ్రీకర్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్.