Nicholas Pooran Droped Travis Head Catch: పవర్‌ప్లే ఆరో ఓవర్‌లో ట్రావిస్ హెడ్‌కు తొలి లైఫ్ వచ్చింది. రవి బిష్ణోయ్ వేసిన తొలి బంతికే హెడ్ భారీ షాట్ ఆడాడు. కానీ, బంతి లాంగ్ ఆన్‌లో పడింది. నికోలస్ పూరన్ లాంగ్ ఆన్‌లో తన సులభమైన క్యాచ్‌ను వదిలివేశాడు. దీంతో హైదారాబాద్ ఫ్యాన్స్ అంతా ఊపిరిపీల్చుకున్నారు. అలాగే, ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ కూడా ఒత్తిడికి లోనై, క్యాచ్ మిస్సవ్వడంతో ఊపరి పీల్చుకుంది. ఈ క్రమంలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
అదే ఓవర్లో హెడ్ 35 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. బిష్ణోయ్ తన ఐదవ బంతికి హెడ్ అందించిన రిటర్న్ క్యాచ్‌ను వదిలివేశాడు. ఆ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి.
Travis Head catch drop tha tab kaviya Maran expression 🥵 #SRHvLSG #TravisHead #POORAN #LucknowSuperGiants #SunrisersHyderabad pic.twitter.com/badtkPc1X7
— CrickStudd (@CrickStudd) March 27, 2025
Two drop catch of Travis Head in the same over. pic.twitter.com/7XKdNHwJSw
— R A T N I S H (@LoyalSachinFan) March 27, 2025
8వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ మూడో వికెట్ తీసుకుంది. మూడో బంతికి ప్రిన్స్ యాదవ్ ట్రావిస్ హెడ్‌ను బౌల్డ్ చేశాడు. హెడ్ 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..