IND vs ENG: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ముందు ఊరించే టార్గెట్‌! రెండో గెలుపు దక్కాలంటే..

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సమాన పరుగులు చేసిన భారత్, ఇంగ్లాండ్‌ను 192 పరుగులకు కుప్పకూల్చింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకు 193 పరుగుల విజయ లక్ష్యం ఉంది.

IND vs ENG: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ముందు ఊరించే టార్గెట్‌! రెండో గెలుపు దక్కాలంటే..
Team India

Updated on: Jul 13, 2025 | 9:32 PM

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఒక విధంగా చెప్పాలంటే.. విజయానికి చాలా చేరువలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఇంగ్లాండ్‌తో సమానంగా నిలిచింది. ఆ తర్వాత 0 లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌ను కేవలం 192 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చాడు. వాషింగ్టన్‌ సుందర్‌ తన సూపర్‌ మ్యాజికల్‌ బౌలింగ్‌తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్‌కు వరుసగా రెండో ఓటమి రుచిచూపించే దిశగా టీమిండియాను నడిపించాడు.

12.1 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక టీమిండియా ప్రతిష్టాత్మక లార్డ్స్‌ టెస్ట్‌ గెలవాలంటే.. కేవలం 193 పరుగులు చేస్తే చాలు. ఇప్పటికే రెండో టెస్టు గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌ గెలవాలనే కసితోనే ఉంది. టార్గెట్‌ కూడా చిన్నదే కాబట్టి విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ, ఈ మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌ కావడం, ఆట నాలుగో రోజుకు చేరుకోవడం బ్యాటింగ్‌ అంత ఈజీగా ఉండదు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌ల్లో రెండు జట్లు కూడా 387 పరుగులు చేశాయి. ఇక వికెట్లేమీ కోల్పోకుండా 2 పరుగులు చేసి మూడో రోజు ఆట ముగించిన ఇంగ్లాండ్‌.. నాలుగో రోజు లంచ్‌ తర్వాత 192 పరుగులకు ఆలౌట్‌ అయింది. జో రూట్‌ 40, బెన్‌ స్టోక్స్‌ 33 పరుగులు చేసి.. భారత బౌలర్లతో కాసేపు పోరాటం చేశారు. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 4, సిరాజ్‌ 2, బుమ్రా 2, ఆకాశ్‌ దీప్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి